సైబర్‌ నేరగాడి వలలో చిక్కుకొని అనూష అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది.

సైబర్‌ నేరగాడి వలలో చిక్కుకొని అనూష అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పీఎస్‌ పరిధిలో చోటు చేసుకుంది. వర్క్‌ ఫ్రమ్‌ హోం పేరిట సైబర్‌ నేరగాడు ఆమెను మోసం చేశాడు. సుమారు రూ.లక్ష నగదు పొగొట్టుకున్న అనూష.. గురువారం ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు అనూష లేఖ రాసింది. యాప్‌ల వలలో పడి ఎవరూ మోసపోవద్దని అందులో పేర్కొన్నట్లు సమాచారం. ఏపీలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఆమె.. కేపీహెచ్‌బీలో నివాసముంటోంది.

ehatv

ehatv

Next Story