స్మితా సభర్వాల్‌ను తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్‌కు మెంబర్ సెక్రటరీగా బదిలీ చేశారు.

స్మితా సభర్వాల్‌ను తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్‌కు మెంబర్ సెక్రటరీగా బదిలీ చేశారు. ఇదే పోస్టును ఆమె గతంలో జనవరి 4, 2024 నుంచి నవంబర్ 10, 2024 వరకు నిర్వహించారు. ఆమె నవంబర్ 11, 2024 నుంచి ఏప్రిల్ 27, 2025 వరకు యూత్ అడ్వాన్స్‌మెంట్, టూరిజం & కల్చర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా, అలాగే ఆర్కియాలజీ డైరెక్టర్‌గా పనిచేశారు. తెలంగాణ ప్రభుత్వం 20 మంది IAS అధికారులను బదిలీ చేసింది,స్మితా సభర్వాల్ బదిలీకి ప్రధాన కారణం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని కంచె గచ్చిబౌలి 400 ఎకరాల భూమి వివాదంతో ముడి పడి ఉంది. ఆమె AI-జనరేటెడ్ గిబ్లీ-స్టైల్ ఇమేజ్‌ను రీపోస్ట్ చేశారు, ఇందులో చెట్లు నరకడం ఇమేజ్ ఉంది. ఈ రీపోస్ట్ ప్రభుత్వ వ్యతిరేక ధోరణిగా భావించి ఆమె పోలీసులు నోటీసులు ఇచ్చారు. గచ్చిబౌలి పోలీసులు BNS సెక్షన్ 179 కింద స్మితాకు నోటీసులు జారీ చేశారు. ఆమె సైబరాబాద్ పోలీసుల ముందు విచారణకు హాజరై, ఈ పోస్ట్‌ను 2,000 మంది రీపోస్ట్ చేసినప్పటికీ తనను మాత్రమే టార్గెట్ చేశారని "సెలెక్టివ్ టార్గెటింగ్" ఆరోపించారు. కొందరు ఈ బదిలీని స్మితా సభర్వాల్‌పై రాజకీయ ఒత్తిడిగా, ముఖ్యంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వచ్చిన స్పందనగా భావిస్తున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో సీఎంవోలో కీలక పాత్ర పోషించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆమెను సీఎంవో నుంచి తొలగించి ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా నియమించారు. స్మితా సభర్వాల్ ప్రస్తుతం తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ బదిలీని కొందరు "లూప్-లైన్" పోస్టింగ్‌గా భావిస్తున్నారు. అయితే తాజాగా ఆమె చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. భగవద్గీతలోని అంశాన్ని తన బదిలీకి అన్వయిస్తూ స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు. ''నువ్వు కర్మ చేయడానికి మాత్రమేగానీ, ఆ కర్మఫలానికి అధికారివి కాదు; ప్రతిఫలాపేక్షతో కర్మలను చేయకు; అలాగని కర్మలు చేయడం మానకు'' అంటూ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ తన బదిలీకి అన్వయించి చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
