ఇజ్రాయెల్‌(Israel) మళ్లీ రెచ్చిపోతున్నది. వారం రోజుల కాల్పుల(Firing) విరమణ ముగిసిన మరు నిమిషంలోనే గాజా(Gaza) స్ట్రిప్‌పై విరుచుకుపడటం మొదలుపెట్టింది. ఫలితంగా గాజా కాల్పులతో దద్దరిల్లుతోంది. గాజాలోని ఇళ్లు, భవనాలపై క్షిపణులు(Missiles), రాకెట్లు(Rockets), బాంబులతో(Bombs) ఇజ్రాయెల్‌ సైన్యం దాడులు చేస్తోంది.

ఇజ్రాయెల్‌(Israel) మళ్లీ రెచ్చిపోతున్నది. వారం రోజుల కాల్పుల(Firing) విరమణ ముగిసిన మరు నిమిషంలోనే గాజా(Gaza) స్ట్రిప్‌పై విరుచుకుపడటం మొదలుపెట్టింది. ఫలితంగా గాజా కాల్పులతో దద్దరిల్లుతోంది. గాజాలోని ఇళ్లు, భవనాలపై క్షిపణులు(Missiles), రాకెట్లు(Rockets), బాంబులతో(Bombs) ఇజ్రాయెల్‌ సైన్యం దాడులు చేస్తోంది. ఖాన్​ యూనిస్‌లో(Khan University) ఒక భారీ భవన సముదాయం నెలమట్టమయ్యింది. హమాద్‌లో కూడా ఒక అపార్ట్‌మెంట్‌పై క్షిపణుల వర్షం కురిపించింది. కాల్పుల విరమణ ముగిసిన తర్వాత జరిగిన ఆడులలో ఇప్పటికే 180 మంది మరణించారు. దక్షిణ గాజాపై (South Gaza)కూడా ఇజ్రాయెల్​ సైన్యం దాడులను ఉధృతం చేయాలనుకుంటోంది. అందుకే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ రోజంతా అక్కడ కరపత్రాలు జారవిడిచింది. యుద్ధ లక్ష్యాల సాధనకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని ఇజ్రాయెల్‌ సేన చెబుతోంది. బందీలందరినీ విడిపించుకోవడం, హమాస్‌ను నిర్మూలించడం లక్ష్యంగా పెట్టుకున్నామని, అది నెరవేరేవరకు సైనిక చర్య కొనసాగుతుందని ఇజ్రాయెల్​ ప్రధాని బెంజమిన్​ నెతన్యాహూ కార్యాలయం తెలిపింది.
మహిళా బందీలందరినీ వదిలేస్తామన్న ఒప్పంద వాగ్దానాన్ని హమాస్​ ఉల్లంఘించడం వల్లే దాడులను తిరిగి మొదలు పెట్టాల్సి వచ్చిందని నెతన్యాహూ చెబుతున్నారు.

Updated On 2 Dec 2023 2:20 AM GMT
Ehatv

Ehatv

Next Story