జూబ్లీహిల్స్‌ ఎన్నికల్లో BRSదే గెలుస్తుందని చాణక్యస్ట్రాటర్జీ సర్వే వెల్లడించింది.

జూబ్లీహిల్స్‌ ఎన్నికల్లో BRSదే గెలుస్తుందని చాణక్యస్ట్రాటర్జీ సర్వే వెల్లడించింది. ఇందులో బీఆర్‌ఎస్‌ పార్టీకి 43% ఓట్లు వస్తాయని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి 38% ఓట్లు వస్తాయని సర్వే వెల్లడించింది. బీజేపీకి 10%, స్వింగ్‌ ఓటర్లు 9% ఉన్నారని సర్వే వెల్లడించింది. ఈసారి ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి అంటున్న చాణక్య సర్వే. ముస్లింలలో మహిళా ఓట్లు ఎక్కువగా బీఆర్‌ఎస్‌కు పడతాయని, పురుషుల ముస్లిం ఓట్లు కాంగ్రెస్‌కు పడే అవకాశం ఉందన్నారు. బీసీల్లో అన్ని కులాలను కాంగ్రెస్‌ అభ్యర్థి కలుపుకొని పోవడం లేదన్న భావన ప్రజల్లో ఉందని సర్వే వెల్లడించింది. బీసీ ఓట్లు 50 శాతం కాంగ్రెస్‌కు, 30 శాతం ఓట్లు బీఆర్‌ఎస్‌కు, 20 శాతం ఓట్లు బీజేపీకి పడతాయని సర్వే వెల్లడించింది. సెటిలర్ల ఓట్లు 65 శాతం బీఆర్‌ఎస్‌కు, 35 శాతం కాంగ్రెస్‌కు పడే అవకాశం వస్తుందని సర్వే వెల్లడించింది. సెటిలర్లలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారస్తులున్నారు. హైడ్రా ఎఫెక్ట్‌తో రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదేలయిందని, దీంతో దానికి అనుబంధంగా ఉన్న 18 వ్యాపారాల్లో 30 శాతం వ్యాపారాలు తగ్గిపోయాయి. రియల్‌ఎస్టేట్‌, దానిపై ఆధారపడిన రంగాలవారు అసంతృప్తిగా ఉన్నారని సర్వే వెల్లడించింది. బీఆర్‌ఎస్‌కు సైలెంట్‌ ఓటింగ్‌ ఎక్కువ ఉందన్నారు. బీసీల్లో కాంగ్రెస్‌కు యాదవ కమిటీ పూర్తిగా ఉందన్నారు. వ్యక్తిగతంగా నవీన్‌యాదవ్‌కు మంచి పేరున్నా ప్రభుత్వ వ్యతిరేకత దానిని అధిగమిస్తుందన్నారు. ముస్లింఓట్లు, రేషన్‌కార్డులు కాంగ్రెస్‌కు కలిసి వచ్చే అంశాలు. 63 శాతం ప్రజలు కాంగ్రెస్‌ పాలన బాగాలేదని చెప్పారు. 29 శాతం బాగుందన్నారు, 8 శాతం ప్రజలు ఇప్పుడే చెప్పలేమన్నారని సర్వే తెలిపింది. బై ఎలక్షన్‌లో కాంగ్రెస్‌ వ్యతిరేకత ఓటు ఎక్కువగా పడుతుందన్నారు. కాంగ్రెస్‌ పాలనలో పాజిటివిటీ కంటే నెగిటివిటీ రెండు రెట్లు ఎక్కువ ఉందని సర్వే వెల్లడించింది. రాబోయే ఎన్నికల్లో మినిమం 5 నుంచి 8 శాతం, 10 వేల నుంచి 16 వేల ఓట్ల మెజార్టీతో బీఆర్‌ఎస్‌ గెలిచే అవకాశం ఉందని సర్వే తెలిపింది.

Updated On
ehatv

ehatv

Next Story