బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన వ్యక్తిగత గురించి ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశాడు.

బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన వ్యక్తిగత గురించి ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశాడు. తన మాటలు, హావభావాల ద్వారా ఎప్పుడూ వార్తల్లోకి ఎక్కుతుంటారు. తాజాగా కాజోల్, ట్వింకిల్ ఖన్నా నిర్వహిస్తున్న టాక్ షోకి కరణ్ జోహర్ హాజరయ్యాడు. ఈ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ఓపెన్‌గా షేర్ చేశారు. ఈ షోలో జాన్వీ కపూర్.. కరణ్‌కు “నీవు ఒక నిజం, ఒక అబద్దం చెప్పాలి. అది నిజమా? అబద్దమా?” అని మేము డిసైడ్ చేస్తాం అని చెప్పారు. అయితే కరణ్ జోహర్ తన బ్రహ్మచర్యం 26 ఏళ్ల వయసులో ముగిసిందని, అది కూడా జాన్వీ కుటుంబంలోని వ్యక్తితో అని చెప్పాడు. దీంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. ఏకంగా జాన్వీ కపూర్ షాక్ అయ్యి వెంటనే చెవులు, నోరు మూసుకుంది. ఆ ప‌క్క‌న ఉన్న ట్వింకిల్ ఖాన్నా.. స‌ర‌దాగా బోని కపూర్‌తో కాదుగా అంటూ సెటైర్ వేసింది. కరణ్ జోహర్ చెప్పిన రెండు విషయాల గురించి కాజోల్ మాట్లాడుతూ.. నీవు 26 ఏళ్లలో వర్జినిటీ కోల్పోయిన విషయం నిజమే కాని, జాన్వీ కపూర్‌ కుటుంబంలోని వ్యక్తితో సెక్స్ చేశారనే విష‌యం మాత్రం పూర్తిగా అబద్దం అంటూ కాజోల్ చెప్ప‌గా.. దానికి క‌ర‌ణ్ జోహార్ సమాధానం ఇస్తూ.. అవును మొదటిది నిజమే కానీ రెండో విషయం అబద్దం అంటూ వివరణ ఇచ్చారు. మొత్తానికి క‌ర‌ణ్ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఒకవైపు కరణ్ జోహార్ చేసిన సంచలన వ్యాఖ్యలు, మరోవైపు జాన్వీ కపూర్ ఇచ్చిన ఫన్నీ రియాక్షన్ రెండు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇక టూమచ్ షో విషయానికి వస్తే.. ఇటీవల ఆలియా భట్, వరుణ్ ధావన్, చంకీ పాండే, గోవిందా లాంటి సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ షో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతున్నది. ఈ షోను నిఖిల్ మదోక్ నిర్మించారు. ఈ రియాలిటీ షోకు మంచి స్పందన కూడా లభిస్తుంది.

Updated On
ehatv

ehatv

Next Story