కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తిగా మంటల్లో దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తిగా మంటల్లో దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. బస్సులో చిక్కుకున్న 25 మందికిపైగా ప్రయాణికులు..బస్సు కింద చిక్కుకున్న మరో ద్విచక్ర వాహనం. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ప్రధాన రహదారిపై పూర్తిగా మంటల్లో దగ్ధమైన బెంగుళూరు నుండి హైదరాబాద్ వస్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు(DD 01 AN 9190. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణిస్తున్నట్లు, 12 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డట్టు స్థానికుల సమాచారం. అయితే కర్నూలులో అగ్నిప్రమాదానికి గురైన వేమూరి కావేరీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సుపై బయటపడుతున్న సంచలన విషయాలు. ఈ ఏడాది మార్చి 31వ తేదీన ముగిసిన బస్సు ఫిట్ నెస్ వాలిడిటీ, గతేడాది ఏప్రిల్ నెలలో ముగిసిన ఇన్సూరెన్స్, పొల్యూషన్ వాలిడిటీ. పటాన్ చెరులో నిన్న రాత్రి 9.30 మధ్య బయలుదేరి, హైదరాబాద్ లోని అనేక స్టాపుల్లో ప్రయాణికులను ఎక్కించుకుని బెంగళూరు బయలుదేరిన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు. ఈ బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గోళ్లవారిపల్లికి చెందిన గోళ్ల రమేశ్ (35), భార్య అనూష (32), కుమారుడు యశ్వంత్(8), కూతురు మన్విత(6) మృతి. బెంగళూరులో స్థిరపడ్డ రమేష్ కుటుంబం.. హైదరాబాద్ వెళ్లి బెంగళూరు వస్తుండగా ప్రమాదంలో మృతి

Updated On
ehatv

ehatv

Next Story