మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ (Miss England Milla Magee)మిస్ వరల్డ్ పోటీ నుంచి తప్పుకున్న విషయం అందరికీ తెల్సిందే.

మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ (Miss England Milla Magee)మిస్ వరల్డ్ పోటీ నుంచి తప్పుకున్న విషయం అందరికీ తెల్సిందే. హైదరాబాద్‌లో జరిగిన పోటీల్లో తనను అసౌకర్యంగా చూశారని, "వేశ్యలా" ఫీల్ అయ్యానని ఆరోపించింది. పోటీదారులను మధ్యవయస్కులైన పురుషులతో సాంఘికంగా కలవాలని, వారిని ఎంటర్టైన్ చేయాలిని ఒత్తిడి చేశారని, అది తనకు అవమానంగా అనిపించిందని చెప్పింది. అలాగే, రోజంతా బాల్ గౌన్స్ ధరించమని, మేకప్‌తో ఉండమని, స్పాన్సర్ల కోసం "పెర్ఫార్మింగ్ మంకీస్"లా ఉపయోగించారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ అనుభవాలు తన విలువలకు వ్యతిరేకంగా ఉన్నాయని, "బ్యూటీ విత్ ఎ పర్పస్" (Beauty with a Purpose)అనే మిస్ వరల్డ్ నినాదానికి అసలు సంబంధం లేదని, అందుకే పోటీ నుంచి వైదొలగానని చెప్పింది. అయితే ఆమె తాజాగా మరో సంచలన విషయాన్ని బయటపెట్టింది. గుర్తు తెలియని ఒక వ్యక్తి తన దగ్గరకు వచ్చి.. నేను ఈసారి లండన్ లేదా ఇంగ్లాండ్ వచ్చినప్పుడు తనతో ఏకాంతంగా గడపాలని తనను బలవంత పెట్టినట్టు తెలిపిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ. మిస్ వరల్డ్ నిర్వాహకులు తనపై తప్పుడు, పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేస్తున్నారని.. సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జూలియా మోర్లీ(Julia Morley), హిందూ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు పోటీలో అవకాశం లేదని నమ్మి మాగీ వెళ్లిపోయిందని చెప్పడం ఎంతో బాధ కలిగించిందని మిల్లా మాగీ తెలిపింది.
