బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నవంబర్ 17న అల్పపీడనం ఏర్పడనుండగా.. అక్కడికి మరో రెండు లేదా మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఈ అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంటున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కామారెడ్డి, వరంగల్, సిద్ధిపేట, మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వర్షాలు, చలి తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

Updated On
ehatv

ehatv

Next Story