ఆగస్టు 5, 1965 నుంచి సెప్టెంబర్ 22, 1965 వరకు, 17 రోజుల పాటు భారత్-పాక్( Indo-Pak) మధ్య యుద్ధం జరిగింది.

ఆగస్టు 5, 1965 నుంచి సెప్టెంబర్ 22, 1965 వరకు, 17 రోజుల పాటు భారత్-పాక్( Indo-Pak) మధ్య యుద్ధం జరిగింది. పాకిస్తాన్ "ఆపరేషన్ గిబ్రాల్టర్" ద్వారా జమ్మూ కాశ్మీర్‌లో తిరుగుబాటును రెచ్చగొట్టే ప్రయత్నం విఫలమై, రెండు దేశాల మధ్య యుద్ధం సంభవించింది. యునైటెడ్ నేషన్స్ జోక్యంతో సెప్టెంబర్ 22న ఆయుధ విరమణ ప్రకటించారు, 1966లో శాంతి నెలకొల్పాలని తాష్కెంట్ ఒప్పందం చేసుకున్నారు.. భారత్(Bharath) ఈ యుద్ధంలో వ్యూహాత్మకంగా ఆధిక్యం సాధించిందని చాలా మంది చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. అయితే ఈ సందర్భంగా అప్పటికే స్టార్ హీరోగా ఉన్నా ఎన్టీఆర్ దేశ రక్షణ నిధికి విరాళాలు సేకరించాలని ప్రయత్నించారు. అందుకోసం ఎన్టీఆర్ విజ్ఞప్తి పేరుతో ఓ లేఖ రాశారు. ఎన్టీఆర్ (NTR)తన సినిమా స్టార్‌ను ఉపయోగించి దేశ రక్షణ నిధి సేకరణకు గణనీయమైన సహకారం అందించారు. ఎన్టీఆర్, 180 మంది సినీ కళాకారులు, సాంకేతిక నిపుణులతో కలిసి "జైత్రయాత్ర" అనే కళా ప్రదర్శన కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా దేశ రక్షణ నిధికి నిధులు సేకరించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలు, అభిమానులను ఉద్దేశిస్తూ ఆయన రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
