✕
Africa Ancient Fang mask : పాత వస్తువే కదా అని అమ్మేశారు, కోట్లు పలికిందని తెలిసి నివ్వెరపోయారు!
By EhatvPublished on 12 Oct 2023 5:53 AM GMT
ఇంట్లో ఉన్న పాత వస్తువులను వదిలించుకోవడం అంత సులభం కాదు. 99 శాతం మందికి పనికి రాని పాత వస్తువులను పారేయ్యడానికి మనస్కరించదు. కొందరేమో అసలైన విలువ తెలియక ఎంతోస్తే అంత అనుకుని పాతవస్తువులను కొనుక్కునేవారికి ఇచ్చేసి చేతులు దులుపుకుంటుంటారు. ఫ్రాన్స్‌లోని నిమెస్లో ఉంటున్న ఓ వృద్ధ జంట ఎందుకూ పనికిరాదనుకుని తమ ఇంట్లో ఉన్న అరుదైన ఓ ఆఫ్రికన్ మాస్క్‌ను(Africa mask) తక్కువ రేటుకే ఓ ఆర్ట్ డీలర్‌కు(Art Dealers) అమ్మేశారు.

x
Africa Ancient Fang mask
-
- ఇంట్లో ఉన్న పాత వస్తువులను వదిలించుకోవడం అంత సులభం కాదు. 99 శాతం మందికి పనికి రాని పాత వస్తువులను పారేయ్యడానికి మనస్కరించదు. కొందరేమో అసలైన విలువ తెలియక ఎంతోస్తే అంత అనుకుని పాతవస్తువులను కొనుక్కునేవారికి ఇచ్చేసి చేతులు దులుపుకుంటుంటారు. ఫ్రాన్స్‌లోని నిమెస్లో ఉంటున్న ఓ వృద్ధ జంట ఎందుకూ పనికిరాదనుకుని తమ ఇంట్లో ఉన్న అరుదైన ఓ ఆఫ్రికన్ మాస్క్‌ను(Africa mask) తక్కువ రేటుకే ఓ ఆర్ట్ డీలర్‌కు(Art Dealers) అమ్మేశారు. ఆ డీలరుకు దాని విలువ తెలుసుకాబట్టి కోట్ల రూపాయలకు అమ్మేసుకున్నాడు. తాము మోసపోయామని తెలుసుకున్న ఆ వృద్ధ దంపతులు లబోదిబోమంటూ కోర్టును ఆశ్రయించారు. అసలేం జరిగిదంటే.. 2021లో ఓ వృద్ధ భార్యాభర్తలు ఇంటిని క్లీన్ చేస్తున్నప్పుడు పురాతన మాస్క్(Antique Mask) కంటపడింది.పాత సామానులతో పాటే ఆ మాస్క్‌ను కూడా స్థానిక డీలర్‌కు 158 డాలర్లకు అమ్మారు. మన కరెన్సీలో 13 వేల రూపాయలన్నమాట! కొన్ని నెలల తర్వాత అదే మాస్క్‌ను ఆ డీలర్ వేలం వేశాడు. ఆ వేలంపాటలో 3.6 మిలియన్ పౌండ్లు ఇచ్చి ఒకరు కొనుక్కున్నారు. అంటే 36 కోట్ల రూపాయలన్నమాట! ఈ విషయం వార్తా పత్రికల్లో వచ్చింది. అది చదివిన ఆ వృద్ధ జంట ఆశ్చర్యపోయింది.
-
- మాస్క్ విలువేమిటో వారికి అప్పుడు తెలిసొచ్చింది. తాము మోసపోయామని గ్రహించిన ఆ వృద్ధ దంపతులు జ్యుడిషియల్ కోర్టులో కేసు పెట్టారు. డీలర్ తమను మోసం చేశాడని, ఆ వస్తువు విలువ తెలిసీ కూడా ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టాడని కోర్టుకు విన్నవించుకున్నారు.పాత వస్తువుల డీలర్ తమ తోటమాలితో కలిసి కుట్ర పన్నాడని కూడా వీరు ఆరోపించారు. పరిహారంగా తమకు సుమారు 5.55 మిలియన్ డాలర్లు ఇప్పించాలని కోరుతూ డీలర్‌పై దావా వేశారు. అది పనికిరాని మాస్క్ అని అనుకున్నారు కానీ ఆఫ్రికన్ రహస్య సమాజంలో ఆచారాలో ఉపయోగించే అరుదైన ఫాంగ్ మాస్క్ అని తెలుసుకోలేకపోయారు. 20 శతాబ్దం ఆరంభంలో ఈ వృద్ధ భర్త తాత ఆఫ్రికాలో కొలోనియల్ గవర్నర్‌గా ఉన్న కాలం నాటి మాస్క్ అది! కార్బన్-14 నిపుణుడి సహాయం తీసుకున్న డీలర్, తమ తోటమాలి ద్వారా తమ కుటుంబ పూర్వీకుల వివరాలను తెలుసుకుని మాస్క్‌ను అమ్మి సొమ్ము చేసుకున్నాడని వృద్ధ దంపతులు ఆరోపిస్తున్నారు.అయితే పాత సామాన్లు కొన్న వ్యక్తి మాత్రం తాను సెకండ్ హ్యాండ్ డీలరే కానీ పురాతన వస్తువుల డీలర్‌ని కానని , కొన్నపుడు అసలు దాని విలువ తెలియదని కోర్టులో వాదించాడు.
-
- దీంతో దిగువ న్యాయస్థానం డీలర్‌కు అనుకూలంగా తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై ఆ వృద్ధ దంపతులు నవంబర్‌లో నిమ్స్‌లోని హైకోర్టును ఆశ్రయించారు. వేలం ద్వారా వచ్చిన సొమ్ములో కొంత తోటమాలికి కూడా ఇచ్చాడని తెలిపారు. అయితే ఈ వివాదం నేపథ్యంలో ఈ కుటుంబంతో రాజీ చేసుకోవాలని డీలర్ ప్రయత్నించాడు. కానీ వారి పిల్లలు ఒప్పుకోకపోవడంతో ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో ఉంది.ఈ మాస్క్‌ను కొన్న తర్వాత డీలర్ డ్రౌట్ ఎస్టిమేషన్, ఫావ్ ప్యారిస్ అనే రెండు ఫ్రెంచ్ వేలం వేలం నిర్వహించే హౌసెస్‌ను సంప్రదించినట్టు కోర్టు రికార్డుల్లో ఉంది. ఆ మాస్క్ కోట్లు పలుకుతుందని తెలుసుకున్న డీలర్ ఆఫ్రికన్ మాస్క్ నిపుణులను సంప్రదించాడు. అలాగే మాస్ స్పెక్ట్రోమెట్రీ విశ్లేషణను , రేడియో కార్బన్ డేటింగ్ ద్వారా దీని అసలు రేటు తెలుసుకుని మరీ మాంట్‌పెల్లియర్‌లో ఎక్కువ ధరకు వేలం వేశాడు. ఆఫ్రికా దేశానికి సంబంధించిన అరుదైన కళాఖండం అని మెట్రో న్యూస్ అంటోంది. 19వ శతాబ్దానికి చెందిన న్గిల్ మాస్క్ గాబన్‌లోని ఫాంగ్ ప్రజలు వివాహాలు, అంత్యక్రియల సమయంలో ఈ మాస్క్‌ను ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజియంలలో ఇలాంటి మాస్క్‌లు చాలా అరుదుగా కనిపిస్తాయి.

Ehatv
Next Story

