ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజు మరో ట్వీట్‌ చేశారు. ఇది కూడా ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) మీదే!

ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజు మరో ట్వీట్‌ చేశారు. ఇది కూడా ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) మీదే! 'గెలిచే ముందు ఒక అవతారం. గెలిచాక ఇంకో అవతారం. ఏంటీ అవాంతరం..ఎందుకీ అయోమయం.. ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్‌' అంటూ ప్రకాశ్‌రాజ్‌(Prakasha Raj) తనదైన శైలిలో ఇన్‌డైరెక్ట్‌గా వపన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు. దీనికి పవన్‌ కౌంటర్‌ ఇస్తారో లేదో చూడాలి. తిరుమల లడ్డూ(Tirumala Laddu) పై చంద్రబాబు చేసిన కామెంట్ల తర్వాత దేశ వ్యాప్తంగా దీనిపై పెద్ద చర్చ జరుగుతోంది. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పవన్‌కు కోట్‌ చేస్తూ ప్రకాశ్‌రాజ్‌ ఓ పోస్ట్ షేర్‌ చేశారు. ‘మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. విచారించి నేరస్థులపై చర్యలు తీసుకోండి. మీరెందుకు అనవసర భయాలు కల్పించి, దీన్ని జాతీయస్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారు. మన దేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తలు చాలు (కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు ధన్యవాదాలు)' అని ట్వీట్‌ చేశారు. దీనికి పవన్‌ ఘాటుగానే స్పందించారు. ప్రకాశ్‌ రాజ్‌ అంటే గౌరవం ఉన్నప్పటికీ.. సున్నితాంశాలపై తెలుసుకుని మాట్లాడాలని పవన్‌ అన్నారు. ‘ప్రకాష్‌ రాజ్‌తో పాటు పాటు అందరికీ చెబుతున్నా.. విమర్శలకు ముందు ఏం జరిగిందో తెలుసుకోండి. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు’ అని పవన్‌ హెచ్చరించారు. దీనికి ప్రకాశ్‌రాజ్‌ గట్టిగానే బదులిచ్చారు. తాను విదేశాల్లో ఉన్నానని, ఇండియాకు వచ్చాక పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నలకు సమాధానమిస్తానని, అప్పటిదాకా వీలుంటే తన ట్వీట్‌ మళ్లీ చదవి అర్థం చేసుకోవాలని అన్నారు. అలాగే తమిళ హీరో కార్తీ(Tamil Hero Karthik)విషయంలోనూ ప్రకాశ్‌ రాజ్‌ జోక్యం చేసుకున్నారు. వపన్‌కు కార్తీ సారీ చెప్పిన విషయానికి స్పందిస్తూ . ‘చేయని తప్పునకు సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! జస్ట్‌ ఆస్కింగ్‌...’ అని ప్రకాశ్‌రాజ్ ట్వీట్ చేశారు. ఇలా ప్రకాశ్‌ రాజ్‌ ట్వీట్‌ మీద ట్వీట్‌లు చేస్తున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story