ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు వివాహం ముహూర్తం ఖరారైంది.

ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు వివాహం ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 22న ఆమె పెళ్లి పీటలెక్కనున్నది. రెండేండ్ల బీడబ్ల్యూఎఫ్‌ టైటిల్‌ నిరీక్షణకు రెండ్రోజుల క్రితమే ముగిసిన సయ్యద్‌ మోడీ ఇంటర్నేషనల్‌ టోర్నీతో తెరదించిన సింధు.. ఈ నెల 22న వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. డిసెంబర్‌ 22న ఉదయ్‌పూర్‌(రాజస్థాన్‌)లో హైదరాబాద్‌కు చెందిన ఐటీ ప్రొఫెషనల్‌ వెంకట దత్తసాయితో ఆమె పెళ్లి జరుగనుంది. హైదరాబాద్‌లోని పొసిడెక్స్‌ టెక్నాలజీస్‌లో వెంకట దత్త సాయి(venkata datta sai) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. డిసెంబర్‌ 24న హైదరాబాద్‌లో హెచ్‌ఐసీసీ వీరి రిసెప్షన్‌ను నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

Updated On
ehatv

ehatv

Next Story