అసలే నేషనల్ క్రష్.. ఇక ఈ హిట్ తో ఆ ఇమేజ్ డబుల్ అయ్యింది. ఇక వరుస సినిమాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి.

పుష్ప2 హిట్ తో మంచి జోరు మీద ఉంది రష్మికమందన్న. పాన్ ఇండియా రేంజ్ లో ఆమె డిమాండ్ మామూలుగా లేదు మరి. అసలే నేషనల్ క్రష్.. ఇక ఈ హిట్ తో ఆ ఇమేజ్ డబుల్ అయ్యింది. ఇక వరుస సినిమాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. బాలీవుడ్ లో కూడా రష్మిక కోసం ఎదురుచూస్తున్నారు మేకర్స్. ఇప్పటికే చాలా సినిమాలు చేసింది బాలీవుడ్ లో .. ఇటు సౌత్ అటు నార్త్ రెండు వైపులా జర్నీ చేస్తూ.. బ్యాలన్స్ చేస్తుంది రష్మిక. కన్నడ పరిశ్రమనుంచి వచ్చిన ఈ బ్యూటీ కన్నడాలో రెండు మూడు హిట్లు పడటంతో పెళ్ళి చేసుకోవాలని హీరో రక్షిత్ శెట్టి()తో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. కాని సడెన్ గా టాలీవుడ్(Tollywood) ఆఫర్ రావడం.. ఛలో సినిమాలో హిట్ కొట్టడంతో పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది. ఇక గీత గోవిందం(Geeta Govindham) హిట్ తో.. కెరీర్ పై గట్టిగా దృష్టి పెట్టింది రష్మిక మందన్నా(Rashmika Mandanna). ఆమె చేసే సినిమాల్లో ఒకటీరెండు తప్పించి.. దాదాపు అన్ని హిట్ పడుతుండటం.. రష్మికకు బాగా కలిసి వస్తోంది. ఈక్రమంలోనే టాలీవుడ్ లో మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్లతో సినిమాలు చేసింది బ్యూటీ. ఈక్రమంలోనే రష్మిక అదృష్టాన్ని మార్చిన సినిమా పుష్ప. ఈసినిమాలో శ్రీవల్లి పాత్రం రష్మిక ఇమేజ్ నే మార్చేసింది. ఇక ఇప్పుడు పుష్ప2 తో అంతకు మించి సాధించింది బ్యూటీ. ఇక ఈక్రమంలో మరో సారి రష్మిక పెళ్ళి మేటర్ వైరల్ అవుతోంది. ఈ బ్యూటీ విజయ్ తో ప్రేమలో మునిగితేలుతుందని కన్ ఫార్మ్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఈ విషయంలో ఇద్దరు బయటపడటంలేదు కాని.. అప్పుడప్పుడు వీరు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల దొరికిపోతున్నారు. ఈ విషయం పక్కన పెడితే.. తనకు ఎలాంటి భర్త కావాలో రీసెంట్ గో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది రష్మిక. ఆమె మాట్లాడుతూ ‘నా కాబోయే భర్త నా ప్రతీ దశలోనూ నాకు తోడుగా ఉంటూ నాతో పాటు నడవాలి. కష్టసమయం లో నన్ను, నా మనసుని అర్థం చేసుకొని నాకు స్ట్రాంగ్ పిల్లర్ లాగా నిలబడాలి. నాకు అత్యంత గౌరవం ఇస్తూ, నా పై ప్రత్యేకమైన శ్రద్ద చూపించాలి. ఒక వయస్సు వచ్చిన తర్వాత కచ్చితంగా తోడు కావాలని అనిపిస్తుంది. నిజమైన ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే ఆ తోడు దొరుకుతుంది. అలాంటి నిజమైన ప్రేమని పంచే వ్యక్తి నా జీవితంలోకి రావాలి’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది.ఇదంతా ఈమె ఇప్పుడు ఎందుకు చెప్తుంది. విజయ్ దేవరకొండతో పీకల్లోతు ప్రేమలో ఉంది కదా అని నెటిజన్లు అంటున్నారు. హైదరాబాద్ వస్తే విజయ ఇంట్లేనే ఉంటుందట బ్యూటీ. షాపింగ్ లకు వెళ్లడం. విజయ్ ఫ్యామిలీతో సినిమాలు చూడటం. ఇలా చాలా సీక్రేట్ గా అన్నీ జరిగిపోతున్నాయని తెలుస్తోంది. మరి ఇలా ఎన్నిరోజులు బయటపడకుండా ఉంటారుఅంటూ ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్.
