అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై పుష్ప హీరోయిన్ రష్మిక ట్వీట్‌ చేశారు. 'నేను ప్రస్తుతం చూస్తున్నది నమ్మలేకపోతున్నాను.

అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై పుష్ప హీరోయిన్ రష్మిక ట్వీట్‌ చేశారు. 'నేను ప్రస్తుతం చూస్తున్నది నమ్మలేకపోతున్నాను. జరిగిన సంఘటన దురదృష్టకరం, తీవ్ర విషాదకర సంఘటన. అయితే, అంతా ఒకే వ్యక్తిపై ఆరోపణలు చేయడం నిరుత్సాహపరుస్తుంది. ఈ పరిస్థితి నమ్మశక్యం కానిది, హృదయ విదారకమైనది.కాగా సంధ్య థియేటర్‌ ఘటన కేసులో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్ప-2 విడుదల సందర్భంగా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. దీంతో హీరో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.

Updated On
ehatv

ehatv

Next Story