ఓబుళాపురం మైనింగ్ కేసులో హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

ఓబుళాపురం మైనింగ్ కేసులో(Obulapuram Mining Case) హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టు(CBI Court) సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దులోని అనంతపురం జిల్లాలో జరిగిన అక్రమ ఇనుప గనుల తవ్వకాలకు సంబంధించినది. 13 ఏళ్ల విచారణ తర్వాత వచ్చిన ఈ తీర్పులో గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష విధించగా, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy)కి క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే మొదటి నుంచి సబితారెడ్డి ఇది తప్పుడు కేసు అని.. జగన్(Ys Jagan)ను ఇరికించేందుకు కాంగ్రెస్ పార్టీ (Congress party)తనపై కేసులు నమోదు చేయించిందని చెబుతూ వచ్చారు. కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించిన జగన్‌పై కేసులు పెట్టే క్రమంలో తనను కూడా ఇరికించారని ఆమె చెప్పుకున్నారు. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని అయినా తనపై అక్రమ కేసులు పెట్టించారని కాంగ్రెస్ అధిష్టానంపై ఆమె పలు మార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తనను తప్పుడు కేసుల్లో ఇరికించి తన ఎంటైర్ పొలిటికల్ కేరీర్‌లో మచ్చ తెచ్చిపెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను పార్టీ వీడి బీఆర్‌ఎస్(BRS)లో చేరడానికి కూడా ఈ అక్రమ కేసులే కారణమని చెప్పుకున్నారు. సబితారెడ్డి వాదనలే నిజమయ్యాయి. ఆమెపై కేసు నమోదు చేసిన సమయంలో కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. సబితకు క్లీన్ చీట్ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీకి ఒకింత షాక్ తగిలిందనే చెప్పాలి.
