సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో సిగాచి రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో సిగాచి రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రియాక్టర్ పేలుడు కారణంగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 10 మంది కార్మికులు మృతి చెందినట్లు సమాచారం. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సుమారు 20 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు, వీరిని ఆసుపత్రికి తరలించారు, కొందరి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు ధాటికి కొందరు కార్మికులు 100 మీటర్ల దూరం ఎగిరిపడినట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు రెండు ఫైర్ ఇంజన్లతో ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటన విషాదకరమని, గాయపడినవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని స్థానిక నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.

Updated On
ehatv

ehatv

Next Story