జస్టిస్ ఎన్‌.హరినాథ్ నేతృత్వంలో ఏపీ హైకోర్టు ఒక ముఖ్యమైన తీర్పు ఇచ్చింది.

జస్టిస్ ఎన్‌.హరినాథ్ నేతృత్వంలో ఏపీ హైకోర్టు ఒక ముఖ్యమైన తీర్పు ఇచ్చింది. షెడ్యూల్డ్ కులాల వ్యక్తులు క్రైస్తవ మతంలోకి మారిన రోజు నుంచే వారి ఎస్సీ హోదా రద్దవుతుందని, అందువల్ల ఎస్సీ/ఎస్టీ అత్యాచార నివారణ చట్టం, 1989 కింద రక్షణ పొందలేరని స్పష్టం చేసింది. గుంటూరు జిల్లాలోని కొత్తపాలెం నుంచి పాస్టర్ చింతాడ ఆనంద్ అనే వ్యక్తి దాఖలు చేసిన ఫిర్యాదు మేరకుఈ తీర్పు వచ్చింది. . ఆనంద్(Anand), 10 సంవత్సరాలుగా పాస్టర్‌గా పనిచేస్తూ, కులం పేరుతో దూషణలు, దాడులు జరిగాయని 2021 జనవరిలో ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశాడు. అక్కల రామిరెడ్డి(Akkala Ramireddy), ఇతరులపై కుల దూషణలు చేశారని ఆనంద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు, . పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేసి, స్పెషల్ కోర్టులో కేసు నడిచింది. రామిరెడ్డి తరఫు న్యాయవాది ఫణి దత్(Phani Datt), ఆనంద్ క్రైస్తవ పాస్టర్‌గా ఉండటం వల్ల ఎస్సీ హోదా కోల్పోయాడని,షెడ్యూల్డ్ కులాలు ఆర్డర్, 1950 ప్రకారం హిందువులకు మాత్రమే ఈ హోదా వర్తిస్తుందని వాదించారు. ఆనంద్ తరఫు న్యాయవాది, అతనికి హిందూ మాదిగ కుల ధృవీకరణ పత్రం ఉందని, దాడి ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ఆనంద్‌ ఎస్సీ హోదా క్లెయిమ్ చేయలేడని హైకోర్టు తీర్పు ఇచ్చింది.క్రైస్తవ మతంలో కుల వ్యవస్థ లేదని, ఎస్సీ హోదా హిందూ సామాజిక వర్గమని కోర్టు తెలిపింది. ఆనంద్‌కు ఉన్న కుల ధృవీకరణ పత్రం రద్దు కానప్పటికీ, అతను క్రైస్తవ విశ్వాసంలో ఉన్నందున ఎస్సీ/ఎస్టీ చట్టం కింద రక్షణ పొందే అర్హత లేదని కోర్టు పేర్కొంది. ఐపీసీ కింద నమోదైన ఆరోపణలకు సరిపడా ఆధారాలు లేనందున, కేసు కొట్టివేశారు. ఈ తీర్పు ద్వారా, క్రైస్తవ మతంలోకి మారిన ఎస్సీ వ్యక్తులు ఎస్సీ/ఎస్టీ చట్టం కింద రక్షణ లేదా రిజర్వేషన్ ప్రయోజనాలు క్లెయిమ్ చేయలేరని స్పష్టమైంది. 2016లో కూడా చిన్ని అప్పారావు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ కేసులో కూడా ఇలాంటి తీర్పు వచ్చింది, ఇది క్రైస్తవ మతంలోకి మారిన వారికి ఎస్సీ రక్షణలు వర్తించవని నిర్ధారించింది. అయితే, ఈ విషయంపై సుప్రీం కోర్టులో కొన్ని పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి, ఇవి దళిత క్రైస్తవులు, ముస్లింలకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతున్నాయి.

ehatv

ehatv

Next Story