పవన్ కళ్యాణ్‌కు అంతా తెలుసు.. ఆయన వెంటనే స్పందించి ఉంటే డ్రైవర్ హత్య జరిగేది కాదని పోలీసుల విచారణలో వినూత దంపతులు వెల్లడించారు.

పవన్ కళ్యాణ్‌కు అంతా తెలుసు.. ఆయన వెంటనే స్పందించి ఉంటే డ్రైవర్ హత్య జరిగేది కాదని పోలీసుల విచారణలో వినూత దంపతులు వెల్లడించారు. కోటా వినూత(Kota Vinutha)కు చెందిన వ్యక్తిగత వీడియోలు డ్రైవర్ శ్రీనివాస్ వద్ద ఉండడం వల్లే హత్య జరిగినట్లు విచారణలో వెల్లడించిన పోలీసులు. డ్రైవర్ శ్రీనివాస్ (Srinivas)హత్య కేసులో పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించిన కోటా వినూత దంపతులు. ''టీడీపీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి(Bojjala Sudheer Reddy) మా బెడ్ రూంలో రహస్య కెమెరాలు పెట్టించి వీడియోలు రికార్డు చేయించారు. మా డ్రైవర్ శ్రీనివాస్‌ను ప్రలోభపెట్టి ఆయనకు అనుకూలంగా మార్చుకున్నారు. అనంతరం ఆ వీడియోలను డ్రైవర్ శ్రీనివాస్ రూ.30 లక్షలకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి విక్రయించాడు. వాటితో ఆయన తన వర్గీయుల ద్వారా మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయించారు.. ఈ విషయం తెలియగానే శ్రీనివాస్‌ను పని నుంచి తొలిగించాము. ఆ విషయాన్ని వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌( Pawan Kalyan)కు చెప్పాం.. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu Naidu)తో మాట్లాడి ఎలాంటి ఇబ్బంది లేకుండా సెటిల్ చేస్తానని హామీ ఇచ్చారు కానీ ఆయన పట్టించుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు వెంటనే బాధ్యతాయుతంగా స్పందించి ఉంటే శ్రీనివాస్ హత్య వరకు వచ్చేది కాదని చెన్నై పోలీసుల విచారణలో కోటా వినూత దంపతులు వెల్లడించారు.

ehatv

ehatv

Next Story