✕
రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్‌లో చోటు చేసుకున్న మాధవి హత్యకేసులో కొత్త వివరాలు వెలుగులోకి వచ్చాయి.

x
రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్‌లో చోటు చేసుకున్న మాధవి హత్యకేసులో కొత్త వివరాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో, తన మరదలితో ఉన్న వివాహేతర సంబంధమే హత్యకు కారణమని బయటపడింది.పోలీసుల దర్యాప్తులో తెలిసిన వివరాల ప్రకారం భార్య మాధవి పలుమార్లు భర్త గురుమూర్తిని ఆ సంబంధం గురించి ప్రశ్నించి పంచాయతీలు పెట్టింది. అయినా అతను మారకపోవడంతో ఇద్దరి మధ్య తరచూ తగాదాలు జరిగేవని పోలీసులు తెలిపారు.తదుపరి ఒక దశలో, గురుమూర్తి మాధవిని నమ్మించి ఇంటికి తీసుకువచ్చి హత్య చేసినట్లు విచారణలో తేలింది. ఘటనా స్థలంలోని సైంటిఫిక్ ఆధారాలను సేకరించి క్లూస్ టీమ్ సహాయంతో పోలీసులు కోర్టుకు సమర్పించారు. ప్రస్తుతం కేసు రంగారెడ్డి జిల్లా కోర్టులో విచారణ దశలో ఉంది.

ehatv
Next Story

