పోచారం, కాలె యాదయ్యకు స్పీకర్‌ క్లీన్‌చిట్..!

పార్టీ ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి, చేవెళ్ల కాలె యాదయ్య పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పీకర్‌ వారికి క్లీన్‌చిట్‌ ఇచ్చారు. ఇప్పటికీ బీఆర్ఎస్‌తోనే ఉన్నారని, కాంగ్రెస్‌లో చేరలేదని, వారిపై అనర్హత వేటు వేయడం వీలుపడదని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పష్టం చేశారు. న్యాయస్థానాల ఆదేశాలతో స్పీకర్ విచారణ జరిపి గతంలో ఐదుగురిపై అనర్హత వేటు వేయలేమని తీర్పు ఇచ్చారు. కాలె యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవని, వారు ఇప్పటికీ బీఆర్ఎస్‌తోనే ఉన్నారని తన తీర్పులో స్పష్టం చేశారు. దీంతో ఇప్పటివరకు మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్ల విచారణ పూర్తయింది. అయితే దానం నాగేందరర్, కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై విచారణ ఇంకా పెండింగ్‌లో ఉంది.

Updated On
ehatv

ehatv

Next Story