వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి(YSRCP MP Mithun Reddy) కేసులో సుప్రీంకోర్టు(Supreme Court) ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ(Ap CID)కి సుప్రీంకోర్టు షాక్‌ ఇచ్చింది.

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి(YSRCP MP Mithun Reddy) కేసులో సుప్రీంకోర్టు(Supreme Court) ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ(Ap CID)కి సుప్రీంకోర్టు షాక్‌ ఇచ్చింది. రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన లిక్కర్ స్కామ్ కేసు(Liquor scam Case)లో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు మిథున్. ఈ కేసులో ఆయనను అరెస్టు చేసేందుకు ఏపీ సీఐడీ ఢిల్లీ వెళ్లినట్లు వార్తలు వచ్చాయి, దీంతో ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. సుప్రీంకోర్టు ఈ రోజు విచారణ జరిపి, మిథున్ రెడ్డికి తాత్కాలిక ఊరట కల్పించింది. కోర్టు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి, తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు మిథున్‌రెడ్డిని అరెస్టు చేయవద్దని సీఐడీ పోలీసులను ఆదేశించింది. దీంతో ఆయనకు ప్రస్తుతానికి అరెస్టు నుంచి రక్షణ లభించినట్లు అయింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏప్రిల్ 3న తిరస్కరించిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టు ఆ దశలో ఆయనపై నేరారోపణలు లేవని, దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని చెప్పినప్పటికీ, సీఐడీ తీరు రాజకీయ ప్రేరేపితమని వైసీపీ ఆరోపిస్తూ మిథున్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఇప్పుడు ఈ కేసును విచారించి మిథున్‌ రెడ్డికి తాత్కాలిక రిలీఫ్ ఇచ్చింది.

Updated On
ehatv

ehatv

Next Story