ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియనవారెవరూ లేరు.

ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియనవారెవరూ లేరు. అయితే గత కొంత కాలంగా ఆమ్రాపాలి పోస్టింగ్‌పై విస్తృతంగా చర్చ జరుగుతుఓంది. అయితే తాజా ఆమ్రాపాలికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఆమ్రపాలిని తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు ధర్మాసనం తాజాగా స్టే విధించింది. క్యాట్ ఉత్తర్వులను నిలిపివేస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆమ్రపాలి తరఫు న్యాయవాదిని ఆదేశించింది. ఈ క్రమంలో తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. అయితే, ఐఏఎస్ ఆమ్రపాలిని ఏపీకి అలాట్ చేస్తూ గత ఏడాది అక్టోబర్‌లో డీవోపీ ఉత్తర్వులు జారీ చేశారు. డీవోపీటీ ఉత్తర్వులను ఆమ్రపాలి క్యాట్‌లో సవాల్ చేశారు. ఈ క్రమంలో ఐఏఎస్ హరికిరణ్‌తో స్వాపింగ్‌లో భాగంగా ఆమ్రపాలిని క్యాట్ తెలంగాణకు కేటాయించింది. ఈ క్రమంలో క్యాట్ ఉత్తర్వులను డీవోపీటీ మళ్లీ హైకోర్టులో అప్పీల్ చేసింది. ఈ సందర్బంగా ఆమ్రపాలికి స్వాపింగ్ వర్తించదు అని వాదించింది. హరికిరణ్ రిజర్వ్ కేటగిరీ కాబట్టి ఆయనతో ఆమ్రపాలికి స్వాపింగ్ వర్తించదు అని తెలిపింది. ఈ క్రమంలో తాజాగా క్యాట్ ఉత్తర్వులను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆమ్రపాలి న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. అప్పటి వరకు క్యాట్ ఉత్తర్వులపై స్టే విధిస్తున్నట్టు హైకోర్టు తీర్పు ఇచ్చింది.


