✕
స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది.

x
స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ చెప్పాలని ఆదేశించింది. దీంతో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది చెప్పేందుకు రెండు వారాల సమయం ఇవ్వాలని ప్రభుత్వ, ఈసీ న్యాయస్థానాన్ని కోరాయి. దీంతో హైకోర్టు తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. కాగా బీసీ రిజర్వేషన్లు 42 శాతం ఇస్తూ ఇచ్చిన జీవో 9పై హైకోర్టు స్టే ఇప్పటికే ఇచ్చింది.

ehatv
Next Story