స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే విధించింది. విచారణ 4 వారాలకు వాయిదా వేస్తూ ద్విసభ్య ధర్మాసనం నిర్ణయం తీసుకుంది.

స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే విధించింది. విచారణ 4 వారాలకు వాయిదా వేస్తూ ద్విసభ్య ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలుకు నాలుగు వారాల గడువు విధించింది. ప్రభుత్వ కౌంటర్‌పై పిటిషనర్ కౌంటర్ వెయ్యడానికి రెండు వారాల గడువు విధించింది. ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్‌రెడ్డి, రవివర్మ కుమార్ వాదనలు వినిపించారు. బీసీ జనగణన చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ కూడా బీసీ జనగణన చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది. సర్వేలో 57.6 శాతం బీసీ జనాభా ఉందని తేలింది. బీసీ జనగణన శాస్త్రీయంగా నిర్వహించాం. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. రాష్ట్రపతి బిల్లుకు ఆమోదం తెలపలేదు కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బిల్లు ఆమోదం పొందినట్టే. ఒకవేళ బిల్లకు రాష్ట్రపతి ఆమోదం తెలిపి ఉంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసి ఉండేది. గవర్నర్ గడువులోగా ఆమోదించకపోతే చట్టంగా భావించాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సిన అవసరం లేదని ఏజీ సుదర్శన్ రెడ్డి అన్నారు.
