Medaram Jathara: అంగరంగ వైభవంగా మేడారం జాతర.. ట్రాఫిక్‌తో నరకం.. బస్సులు లేక ఆగమాగం..!

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ, తెలంగాణ కుంభమేళ సమ్మక్క-సారలమ్మ మహాజాతర వైభవపేతంగా కొనసాగుతోంది. దాదాపు కోటి మంది భక్తులు వచ్చి దర్శించుకున్నారని అంచనా వేస్తున్నారు. ఈ జాతరకు ప్రభుత్వం గొప్పగా ఏర్పాట్లు చేసిందనే చెప్పాలి. ముఖ్యంగా మంత్రి సీతక్క ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లను చూసుకున్నారు. భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 15 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. అయితే జాతరకు వచ్చిన భక్తులు ట్రాఫిక్‌లో చిక్కుకొని నరకం అనుభవిస్తున్నారు. దర్శనం పూర్తయిన వారు తిరుగు ముఖం పట్టడంతో ట్రాఫిక్‌‌ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాడ్వాయి – మేడారం రూట్‌‌లో ఆర్టీసీ బస్సులు, వీఐపీ వాహనాలకు తోడు ప్రైవేట్‌‌ వెహికల్స్‌‌ రావడంతో భారీగా ట్రాఫిక్‌‌ జాం ఏర్పడింది.ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో 14 కి.మీ ప్రయాణానికి 3 గంటలు పట్టింది. అలాగే గోవిందరావుపేట మండలం పస్రా వద్ద రెండు కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్‌‌ జాం అయింది. ఆ రహదారి డబుల్‌‌ రోడ్డు కాగా.. మూడు వరుసల్లో వాహనాలు రావడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని పోలీసులు తెలిపారు. దీంతో ప్రైవేట్‌‌ వాహనాలను పస్రా మీదుగా.. ఆర్టీసీ, వీఐపీ వెహికల్స్‌‌ను తాడ్వాయి మీదుగా మేడారం వైపు మళ్లించారు.

ప్రభుత్వం జాతర నిర్వహణ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా, రద్దీకనుగుణంగా ఏర్పాట్లు చేయకపోటవంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. గద్దెలకు రెండు వైపులా ఉన్న క్యూలైన్లు ఏర్పాటు చేయగా.. ఎటు వెళ్లాలో తెలియక భక్తులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. సుదూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసాలకోర్చి అమ్మల దర్శనానికి వచ్చిన వారికి తీవ్ర నిరాశ ఎదురైంది. వృద్ధులు, చిన్న పిల్లలు, అనారోగ్యంతో బాధపడే వారు క్యూలైన్లలో అవస్థలు పడ్డారు. తల్లుల దర్శనం కోసం జిల్లా కలెక్టర్‌ మంజూరు చేసిన వీఐపీ, వీవీఐపీ పాస్‌లు పొందిన భక్తులకు శుక్రవారం క్యూలైన్లను ఎత్తివేసారు.

కొన్ని సందర్బాల్లో భక్తులను కంట్రోల్‌ చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. భక్తులపై పోలీసులు లాఠీ చార్జీ కూడా చేశారన్న ఆరోపణలున్నాయి. పలు సార్లు కరెంట్ లీక ఇబ్బందులు పడ్డామని, ఆర్టీసీ సరైన బస్సులు ఏర్పాటు చేయలేక చేతులెత్తేసిందని, భక్తులు సెల్ఫీవీడియోల్లో సమాచారం ఇస్తున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story