✕
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు.

x
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు. సీఎం విజయవాడలో దేవినేని ఇంట్లో పెళ్లి కార్యక్రమంలో పాల్గొనడం వల్ల ప్రకటన సమయం కొద్దిగా ఆలస్యమైంది. 5 లక్షలకు పైగా విద్యార్థులు మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను ఆన్‌లైన్‌లో bse.telangana.gov.in, results.bse.telangana.gov.in, results.bsetelangana.org వెబ్‌సైట్‌లలో చెక్ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం, ఫలితాలు సబ్జెక్ట్‌ల వారీగా మార్కులు, గ్రేడ్‌లతో విడుదలయ్యాయి. గతంలో ఉన్న సీజీపీఏ సిస్టమ్‌ను రద్దు చేశారు. మొత్తం పాస్ శాతం 92.78%గా నమోదైంది, రెసిడెన్షియల్ స్కూళ్లు 98.79%తో అత్యధిక పాస్ రేట్ సాధించాయి.

ehatv
Next Story