ఐస్‌ల్యాండ్‌ (Iceland)లో ఉన్న రెక్టానెస్‌ ద్వీపం (Rectanes Island)లో భారీ అగ్నిపర్వతం బద్దలయ్యింది (Big volcano erupted). లావా ఎగజిమ్మింది. ఆ శిలా ద్రవం జనవాసాలపైకి ప్రవహిస్తోంది. సమీపంలో ఉన్న ఇళ్లన్నీ ధ్వంసమయ్యాయి.

ఐస్‌ల్యాండ్‌ (Iceland)లో ఉన్న రెక్టానెస్‌ ద్వీపం (Rectanes Island)లో భారీ అగ్నిపర్వతం బద్దలయ్యింది (Big volcano erupted). లావా ఎగజిమ్మింది. ఆ శిలా ద్రవం జనవాసాలపైకి ప్రవహిస్తోంది. సమీపంలో ఉన్న ఇళ్లన్నీ ధ్వంసమయ్యాయి. ఇప్పటికే చాలా మంది నివాసాలు ఖాళీ చేసి వెళ్లిపోయారు. అగ్నిపర్వతం నుంచి ఎగజిమ్మిన లావా తమ ప్రాంతంలోకి ప్రవహించే ప్రమాదం ఉందనుకుని పెద్ద పెద్ద బండరాళ్లను అడ్డుగా పెట్టారు. అయినా లాభం లేకుండా పోయింది. దీంతో అధికారులు స్థానికుల ఇళ్లను ఖాళీ చేయించారు. వారంతా సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు. వారితో పాటు పెంపుడు జంతువులు, పశువులను కూడా తీసుకువెళుతున్నారు. ఇప్పటివరకైతే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిపర్వతం బద్దలవ్వడంతో పర్యాటక ప్రాంతమైన బ్లూలాగూన్‌(Tourist destination Blue Lagoon)ను మంగళవారం వరకు మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

Updated On 16 Jan 2024 12:16 AM GMT
Ehatv

Ehatv

Next Story