ఎలాన్‌ మస్క్(Elon Musk).. ప్రపంచంలోనే లక్షల కోట్ల ఆస్తులున్న కుబేరుడు. తాజాగా ఎలాన్‌ మస్క్‌పై వాల్‌స్ట్రీట్(Wall Street) జర్నల్‌ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంలో ఎలాన్‌ మస్క్‌ ఇప్పటికీ డ్రగ్స్‌(Drugs) వాడుతున్నాడని పేర్కొంది. దీంతో ఎలాన్‌మస్క్‌ ఆరోగ్యంతో పాటు.. వ్యాపారాలపై దీని ప్రభావం పడుతుందని వెల్లడించింది. వ్యాపార సామ్రాజ్యంపై ప్రభావం పడుతుండడంతో ఆ సంస్థల డైరెక్టర్లు, బోర్డు సభ్యులు ఆందోళన చెందుతున్నారని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ ప్రచురించింది.

గతంలోనూ మానసిక ఒత్తిడి(Mental Pressure) నుంచి బయటపడేందుకు కెటామైన్‌ లాంటి సైకెడెలిక్‌ డ్రగ్స్‌ను(Psychedelic drugs) వినియోగిస్తూ గత ఏడాది ఎలాన్‌ మస్క్‌ వార్తల కెక్కారు.
కెటామైన్‌ లాంటి సైకెడెలిక్‌ డ్రగ్‌ను వాడేందుకు ప్రిస్క్రిప్షన్‌ను కలిగి ఉన్నట్టు ఎలాన్‌ మస్క్‌ గతంలో బహిరంగంగానే స్వయంగా వెల్లడించారే. అంతేకాకుండా మారిజువానాను సేవించిన ఉదంతాలున్నాయి. 2017లో ఓ ఈవెంట్‌కు వచ్చిన మస్క్‌.. మాదకద్రవ్యాల తీసుకొని.. ఆ మత్తులో అసభ్యకరమైన రీతిలో ప్రసంగించారు. ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో మస్క్‌ డ్రగ్స్‌ తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను మస్క్‌ అటార్నీ అలెక్స్‌ స్పైరో ఖండిచారు. ఎలాన్‌ మస్క్‌కు ఎప్పటికప్పుడు డ్రగ్‌ టెస్టులు చేస్తున్నారని, ఆ పరీక్షల్లో ఆయన డ్రగ్స్‌ తీసుకున్నట్లు ఎప్పుడూ నిర్ధారణ కాలేదని స్పైరో అన్నారు.

Updated On 8 Jan 2024 3:59 AM GMT
Ehatv

Ehatv

Next Story