Harish Rao fire: బిడ్డా మిమ్మల్ని మాత్రం వదలం..! తెలంగాణ పోలీసులకు హరీష్‌రావు వార్నింగ్..!

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణకు హాజరైన క్రమంలో పోలీసుల అత్యుత్సాహంపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రపూరితంగా, ఉద్దేశపూర్వకంగా తమపై కేసులు పెట్టారని తెలిపారు. ఈ కేసులో కేటీఆర్ విచారణకు హాజరయ్యారని.. రేవంత్ రెడ్డిని కూడా ఫోన్ ట్యాపింగ్‌పై విచారించాలని డిమాండ్ చేశారు.

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లకుండా బీఆర్ఎస్ నాయకులపై పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, క్రాంతి నాయక్, ఇతర బీఆర్ఎస్ నాయకులు జూబ్లీహిల్స్‌లోని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పోలీసుల వైఖరిని హరీశ్‌రావు నిలదీశారు. కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. కావాలనే రిటైర్‌మెంట్‌కు దగ్గర ఉన్న అధికారులతో సిట్ ఏర్పాటు చేసి బీఆర్ఎస్ నాయకులను వేధిస్తున్నారని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా రేవంత్ రెడ్డి మాటలు, సీపీ మాటలు విని మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే అధికారులను వదిలిపెట్టమని హెచ్చరించారు. రిటైర్ అయ్యాక కూడా, సప్త సముద్రాల అవతల తాక్కున్నా పట్టుకొస్తామని తెలిపారు. దావోస్‌లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు పాటించడం కాదు.. చట్ట ప్రకారం వ్యహరించాలని సూచించారు. చట్టప్రకారం వ్యవహరించకపోతే వారిదే బాధ్యత అని స్పష్టం చేశారు.

Updated On
ehatv

ehatv

Next Story