AndhraJyothi Radhakrishna: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై కేసు పెడతారా..? సిట్ వేస్తారా..?

ఆంధ్రజ్యోతి గ్రూప్ సంస్థల అధినేత రాధాకృష్ణ ఒక ఆర్టికల్ రాశారు. ఆర్టికల్ కి సంబంధించిన రాజకీయ దుమారం చూశాం. సరే ఆర్టికల్ ఎందుకు రాశారు, ఏం రాశారు, ఆయన జర్నలిస్టులకు చెప్పిన నీతులు ఏంటి నేను దానిలోకి పోదలుచుకోలే, ఆయన జర్నలిస్టులకు నీతులు చెప్పే పరిస్థితిలో లేరు అనేది రాష్ట్రం అంతా తెలుగు ప్రజలంతా భావిస్తున్నారు. కాబట్టి కొత్తగా నేను మళ్ళీ దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం పత్రిక ఏర్పాటు చేసిన, తర్వాత పత్రికను నడుపుతున్న సందర్భంలో, వ్యక్తుల వ్యక్తిత్వ హననాలు మినహా, ఈ రాష్ట్రం బాగు కోసం, ఈ రాష్ట్రంలో ఒక సమస్య బాగు కోసం, ఆ పత్రిక పనిచేసింది ఏంటో, వాళ్ళే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత చాలా సమస్యలపైన, ఎలక్ట్రానిక్ మీడియా పోరాటం చేయడం చూశాం. ఈనాడు లాంటి కొన్ని పత్రికలు, కొన్ని పబ్లిక్ కి సంబంధించిన ఇష్యూస్ పైన వార్తా కథనాలు రాయడం, కనీసం పోరాటం చేయడం, సారా లాంటి ఉద్యమాలు చేయడం చూశాం. కానీ ఆంధ్రజ్యోతి అనే పత్రిక రాధాకృష్ణ నడపడం మొదలు పెట్టిన తర్వాత, ఈ రాష్ట్రంలో ఏదైనా ఒక సామాజిక సమస్య పైన, ఏదో ఒక ప్రజల సమస్య పైన పోరాటం చేసింది ఏంటో, నాకైతే కనపడలేదు, 20 సంవత్సరాలుగా నేను జర్నలిజంలో ఉన్నాను. పత్రిక రోజు చదువుతాను నాకు ఎక్కడా కనపడలేదు కానీ, రాష్ట్ర ప్రజలకు ఏమైనా కనపడిందేమో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి అటువంటి పత్రికను నడుపుతున్న వ్యక్తి నీతులు చెప్తానంటే, జనాలు ఏ రకంగా నవ్వుకుంటారో, ఆయనకు కూడా తెలుసు కాబట్టి, దాని గురించి పెద్దగా ఆయన నీతులు చెప్పడం గురించి పెద్దగా నేను లోపలికి పోదల్చుకోలేదు. భట్టి విక్రమార్క ఎపిసోడ్ గురించి కూడా తర్వాత మాట్లాడదాం. బట్ ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పదే పదే బీఆర్ఎస్పైనో ఇంకెవరి పైననో విమర్శలు చేస్తున్న సందర్భంగా, మాట్లాడే మాట కొంతమంది సోషల్ మీడియా గాళ్ళను పెట్టుకొని, కొంతమంది గొట్టంగాళ్లను పెట్టుకొని, కొంతమంది సోషల్ మీడియాలో సైకో గాళ్ళను పెట్టుకొని ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేస్తున్నారు. వాళ్ళందరి సంగతి చూస్తాం, వాళ్ళ పైన కేసులు పెడతాం, వాళ్ళ సంగతి ఏంటో చూస్తాం, ఈ తరహా వార్నింగ్‌లు ముఖ్యమంత్రి ఇవ్వడం చూశాం. ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు అనేక సందర్భాల్లో ఈ తరహ మాటలు మాట్లాడడం చూస్తున్నాం. సోషల్ మీడియా అంటే, సోషల్ మీడియా అంటే ఒక పనికి మాలిందిగా పదే పదే మాట్లాడడం చూస్తున్నాం, అదే సోషల్ మీడియా కారణంగానే మీరు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు అనే విషయాన్ని కూడా మర్చిపోయి మాట్లాడడం చూస్తున్నాం. ఇప్పుడు రాధాకృష్ణ అనే వ్యక్తి, ఆయన సోషల్ మీడియా కాదు ఆయన పెద్ద మీడియా, ఆయన పత్రిక నడుపుతున్నారు, టీవీ ఛానల్ కూడా నడుపుతున్నారు, టీవీ ఛానల్ పైన జనాలకు నమ్మకం లేదు, కానీ ఇప్పటికీ పత్రికల పైన నమ్మకం ఉందని రాధాకృష్ణ చెప్తున్నారు. మీరు నమ్ముతున్నారు, మొన్న జనవరి ఫస్ట్ కి వెళ్లి కలిసి, అభినందించి, బొకే ఇచ్చి మరీ వచ్చారు. ఆయన జర్నలిజం ప్రమాణాల పట్ల మీకు గౌరవం ఉంది, అటువంటి వ్యక్తి కూడా ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేస్తున్నారు, మరి ఆయన పైన కేసు పెడతారా, సిట్ వేస్తారా, సోషల్ మీడియా ఏమైనా మాట్లాడితే కేసు పెడతాం, సోషల్ మీడియా ఏమన్నా అంటే సిట్ వేస్తాం, సోషల్ మీడియా ఏమన్నా అంటే ఇంకేదో చేస్తాం అని చెప్తున్నారు కదా, ఓ పత్రిక నడుపుతున్న వ్యక్తి పత్రికాధిపతి ఆయన పేరుతో, ఆయన రాసిన మాట ఈ ప్రభుత్వంలో మంత్రుల మధ్య టెండర్ల కోసం కొట్లాట జరుగుతోంది అని, మీ ప్రభుత్వంలో మీకు తెలియకుండా సిట్ ఏర్పాట అయింది అని, అవమానం కాదు, ఇది రేవంత్ రెడ్డికి మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అవమానం కాదు అది అబద్ధం కావాలని, అది అబద్ధమై ఉండాలని కోరుకుంటున్నాం. అది అబద్ధం కాకుండా నిజమే అయితే, మీరు మౌనంగా ఉంటారు, అది అబద్ధం అయితే కేసు పెడతారు, విచారణ చేస్తారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఎవరో వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోని మార్ఫింగ్ చేశారని సిట్లో ఇంక్లూడ్ చేశారు, ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి సజ్జనార్ నేతృత్వంలో ఏర్పాటైన సిట్లో, ఎన్టీవీ లో వచ్చిన కథనంతో పాటు మహబూబ్‌నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి ఫోటోని మార్ఫింగ్ చేశాడు ఒక వ్యక్తి అంటూ ఆయన కేసుని, రెండు కేసులని కలిపి విచారణ చేయడం కోసం సిట్‌ను ఏర్పాటు చేశారు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో వ్యక్తి ముఖ్యమంత్రి ఫోటోని మార్పింగ్ చేస్తే సిట్ విచారణ చేయదగ్గ అంశం అయినప్పుడు, ఓ పత్రికను నడుపుతున్న వ్యక్తి నేరుగా, మంత్రులు టెండర్ల విషయంలో కొట్టుకుంటున్నారు, ఓ మంత్రి, ఉపముఖ్యమంత్రి టెండర్లు తమ వాళ్ళకు ఇప్పించేలా చేయడం కోసం, ఐఏఎస్ అధికారుల పైన దుష్ప్రచారం చేయించే తరహాలో ఎన్టీవీలో కథనాన్ని వేయించారు అని నేరుగా రాస్తే, విచారించదగ్గ అంశం కాదా, సిట్‌లో చేర్చదగ్గ అంశం కాదా, రాధాకృష్ణ మీద కేసు పెట్టాలని అనిపించట్లేదా? రాధాకృష్ణ మాట్లాడిన మాటల్ని కూడా కేస పెట్టి సిట్‌లో యాడ్ చేయాలని అనిపించట్లేదా? మీ ప్రభుత్వంలో మీ మంత్రి నిర్వాకం కారణంగానో, లేకపోతే ఒక ఛానల్ లో వచ్చిన కథనం కారణంగానో ఒక ఐఏఎస్ అధికారిని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దాక వెళ్ళారు, నిద్ర మాత్రం మింగే పరిస్థితిలోకి వెళ్ళారు అంటూ, రాధాకృష్ణ రాశారు. నిజమా కాదా తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది కదా. ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేశారా లేదా ఐఏఎస్ అధికారుల సంఘం కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా? ఇంత పెద్ద వార్త. సోషల్ మీడియా పైన ఒంటికాళ్ళతో లేచి, సోషల్ మీడియా అంటే పనికిమాలిన మీడియాగా అభివర్ణించే ప్రభుత్వ పెద్దలకు, ఓ పెద్ద మీడియా మీ ప్రభుత్వంలోని మంత్రుల పైన మీ ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తుల పైన మీరు డబ్బుల కోసం టెండర్లు పంచుకుంటున్నారంటే, కోపం రావట్లేదా, రోశం రావట్లేదా, ఆత్మగౌరవం లేదు, కన్వీనియంట్ గా మీ న్యాయం ఉంటుందా. కన్వీనియంట్‌గా మీ కేసులు ఉంటాయా? పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో..!


