YCP MLC Third Marriage : వైసీపీ ఎమ్మెల్సీ మూడో పెళ్లి.. దగ్గరుండి జరిపించిన రెండో భార్య!
వైఎస్‌ఆర్ కాంగ్రెస్(YSRCP) పార్టీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ(Jayamangala Venkataramana) పెళ్లి చేసుకున్నారు. ఇందులో విశేషమేముందనుకుంటున్నారు కదూ! ఇది ఆయనకు మూడో పెళ్లి .. అయితే ఏమిటట? అంటారా? ఈ పెళ్లిని జయమంగళ రెండో భార్య సునీత(Sunitha) దగ్గరుండి జరిపించడం, పెళ్లి పెద్దగా నిలిచి సాక్షి సంతకం చేయడం విశేషం కాక మరేమిటి?
జయమంగళ వెంకటరమణ పెళ్లి నిరాడంబరంగా జరిగింది

YCP MLC Third Marriage
వైఎస్‌ఆర్ కాంగ్రెస్(YSRCP) పార్టీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ(Jayamangala Venkataramana) పెళ్లి చేసుకున్నారు. ఇందులో విశేషమేముందనుకుంటున్నారు కదూ! ఇది ఆయనకు మూడో పెళ్లి .. అయితే ఏమిటట? అంటారా? ఈ పెళ్లిని జయమంగళ రెండో భార్య సునీత(Sunitha) దగ్గరుండి జరిపించడం, పెళ్లి పెద్దగా నిలిచి సాక్షి సంతకం చేయడం విశేషం కాక మరేమిటి?
జయమంగళ వెంకటరమణ పెళ్లి నిరాడంబరంగా జరిగింది. ఏలూరు(Eluru) రేంజ్ అటవీ శాఖలో(Forest Officer) సెక్షన్ ఆఫీసర్‌గా పని చేస్తున్న సుజాతను(Sujatha) కైకలూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఎమ్మెల్సీ(MLC) కుమారుడు కూడా ఈ పెళ్లి కార్యక్రమంలో పాల్గొన్నారు.
జయమంగళ వెంకటరమణ మొదటి భార్య అనారోగ్యంతో చనిపోయారు. వీరిద్దరికి ఓ కుమార్తె ఉన్నారు. తర్వాత సునీతను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఓ కూతురు, ఒక కొడుకు ఉన్నారు. అయితే కుటుంబ వివాదాల నేపథ్యంలో ఆయన సునీత నుంచి విడాకులు తీసుకున్నారు. తాజాగా సుజాతను పెళ్లి చేసుకున్నారు. కొత్త దంపతులకు పలువురు నేతలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.