Today Weather Updates: తెలుగురాష్ట్రాల్లో చలిపులి
తెలంగాణలో చలి పులి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. చలి తీవ్రత పెరిగింది.

తెలంగాణలో చలి పులి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. చలి తీవ్రత పెరిగింది. పలు చోట్ల సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. వచ్చే మూడు రోజులు కూడా రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ వెల్లడించింది. ఆదిలాబాద్‌లో 8.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్‌లో 12, హన్మకొండలో 12.5, రామగుండం(Ramagundam)లో 13.4, నిజామాబాద్(Nizambad)లో 13.9, దుండిగల్‌లో 14.8, హకీంపేట్‌లో 15.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. మరోవైపు ఏపీలో కూడా చలి తీవ్రత పెరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తాలోని తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఆంధ్రప్రదేశ్(AP), తెలంగాణ(Telangana)లో వాతావరణం మారిపోయింది. చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఏపీ కంటే తెలంగాణలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గతంలో ఎన్నడూ లేనంతగా చలి ప్రతాపం చూపిస్తోంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చలి వణికిస్తోంది. డిసెంబర్ 15 వరకూ అంటే మరో రెండు మూడు రోజులు పరిస్థితి ఇలానే ఉండవచ్చని ఐఎండీ వెల్లడించింది. అవసరమైతే తప్ప బయటకు రాకూడదని వాతావరణశాఖ సూచిస్తోంది.
