పెళ్లి(Marriage) తర్వాత కొన్ని జంటలు అభిప్రాయభేదాలు, గొడవలతో కొన్ని జంటలు విడిపోతుంటాయి. కోర్టుకు వెళ్లి విడాకులు(Divorce) తెచ్చుకున్న తర్వాత మళ్తీ కొత్త జీవితాలు ప్రారంభిస్తారు. తాజాగా విడాకుల ప్లేస్‌లో మరో విడాకులు వచ్చాయి అవే నిద్ర విడాకులు (Sleep Divorce). ఇప్పుడు ఈ ట్రెండ్ నడుస్తోందట. ఈ స్లీప్ డివోర్స్ ఎందుకు, ఎప్పుడు ఎలా తీసుకుంటారో తెలుసుకుందా...!

Sleep Divorce
పెళ్లి(Marriage) తర్వాత కొన్ని జంటలు అభిప్రాయభేదాలు, గొడవలతో కొన్ని జంటలు విడిపోతుంటాయి. కోర్టుకు వెళ్లి విడాకులు(Divorce) తెచ్చుకున్న తర్వాత మళ్తీ కొత్త జీవితాలు ప్రారంభిస్తారు. తాజాగా విడాకుల ప్లేస్‌లో మరో విడాకులు వచ్చాయి అవే నిద్ర విడాకులు (Sleep Divorce). ఇప్పుడు ఈ ట్రెండ్ నడుస్తోందట. ఈ స్లీప్ డివోర్స్ ఎందుకు, ఎప్పుడు ఎలా తీసుకుంటారో తెలుసుకుందాం...!
ప్రస్తుతం చాలా జంటల్లో ఈ స్లీప్ డివోర్స్ టాపిక్ వస్తోందంటున్నారు మానసిక వైద్య నిపుణులు. ఈ స్లీప్ డివోర్స్ అంటే పెళ్లిని రద్దు చేసుకొని మొత్తానికే విడాకులు తీసుకున్నట్లు అనుకుంటున్నారేమో.. కాదు కాదు... ఒకే ఇంట్లో ఉన్నాకానీ నిద్ర మాత్రం వేర్వేరు గదుల్లో పోవడమే ఈ స్లీప్ డివోర్స్ అట... సాధారణంగా దంపతులు రోజూ ఒకే గదిలో నిద్రిస్తారు. వివాహ జీవితంలో భార్యాభర్తలు తమ శృంగార జీవితంలో మధురానుభూతులు పొందుతుంటారు. రాత్రి అయితే చాలు శృంగార ఆలోచనలతో ఒకరికొకరు దగ్గరవుతుంటారు.
పెళ్లైన కొత్తలో అయితే ఎప్పుడు టైం దొరుకుతుందా అని చూస్తుంటారు. శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. అయితే రానురాను ఈ లైఫ్‌కు పలువురు దూరమవుతున్నారట. దంపతుల మధ్య కెమిస్ట్రీ, మంచి శృంగార జీవితం ఉంటే విడాకుల కాన్సెప్ట్ రాదని సైకలాజిస్టులు చెప్తుంటారు. కానీ రానురాను ఈ లైఫ్‌కు దూరమవుతున్నాయట జంటలు. దీని వల్ల కూడా డివోర్స్ కేసులు ఎక్కువ అవుతున్నాయని మానసిక వైద్యుల(Psychiatrists) విశ్లేషణ. అయితే ఇప్పుడు ఈ స్లీప్ డివోర్స్ వల్ల అసలు డివోర్స్ కేసులు కొంత మేర తగ్గుతున్నాయని అంటున్నారు. ఈ స్లీప్ డివోర్స్‌లో వీరిద్దరూ వేర్వేరు గదుల్లో పడుకోవడమే తప్ప.. మిగతా లైఫ్ అంతా రొటినే అట.
పిల్లలు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అంతా రొటీనే అట. సాధారణంగా కొందరికి వ్యక్తిగత అలవాట్లు, గురక(Snore), బాగా దొర్లడం, కొందరు మహిళలకు ఆల్కహాల్(Alcohol smell) వాసన పడకపోవడంతో వేర్వేరుగా పడుకోడానికి మొగ్గుచూపుతున్నారు. కొందరు అర్ధరాత్రి వరకు టీవీ చూడడం, ఈ మధ్య కాలంలో ఫోన్లు ఎక్కువగా వాడడం, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడంతో శృంగార జీవితానికి దూరమవుతున్నారని అంటున్నారు. ఈ అలవాట్లతో భాగస్వామికి కొంత ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఈ అసహనంతో కొన్ని జంటలు విడాకుల వరకు వెళ్తున్నాయని.. ఈ స్లీప్ డివోర్స్ వల్ల ఆ ప్రమాదం నుంచి బయటపడే అవకాశాలున్నాయని చెప్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని స్లీప్ డివోర్స్ తీసుకొని ఎవరి రూమ్‌లో వారు నిద్రపోవచ్చట. చిన్న చిన్న సమస్యల వల్ల విడాకుల వరకు వెళ్లకుండా ఈ స్లీప్ డివోర్స్ ప్రత్యామ్నాయం చూపుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వివాహ బంధం నుంచి దూరం కాకుండా ఇదొక ఉత్తమ మార్గమంటున్నారు. స్లీప్ డివోర్స్ అంటే ఎలాంటి డిస్ట్రబెన్స్ లేకుండా కొన్ని గంటల పాటు హాయిగా నిద్రపోవడం మాత్రమే అంటున్నారు మానసిక వైద్య నిపుణులు
