విప్లవ సినిమాల బ్రాండ్ అంబాసిడర్ ఆర్ నారాయణమూర్తి. లైఫ్ టైమ్ బ్యాచిలర్ గా ఉన్న ఆయన జీవితంలో ఓ ప్రేమ కథ ఉందని మీకు తెలుసా..?

ఆర్ నారాయణమూర్తి. ఆ పేరు ఓ బ్రాండ్, కమ్యునిజానికి, విప్లవసినిమాలకు, ప్రజలకోసం చేసే పనులకు, కమర్షియల్ అనే పదానికి దూరంగా.. సామాన్యులకు దగ్గరగా ఆర్ నారాయణ మూర్తిప్రస్తానం అందరికి తెలిసిందే. ఇక నారాయణ మూర్తి గురించి ప్రత్యేకంగా వివరంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం 70 ఏళ్ల ఈ విప్లవ వీరుడు ఒంటరి జీవితం కొనసాగిస్తున్నారు. అయితే నారాయణ మూర్తి పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియదు.

అయితే ఆయన యంగ్ ఏజ్ లో ఓ అమ్మాయిని ప్రేమించాడని మీకు తెలుసా...? అవును విప్లవ సినిమాలకు అంకితం అయిపోయిన నారాయణయూర్తి యంగ్ ఏజ్ లో ఓ అమ్మాయిని ప్రేమించారట. ఆ అమ్మాయి కూడా మూర్తిని ప్రేమించిందట. కాని నారాయణమూర్తి ఈ ప్రేమకు స్వస్తి చెప్పారట. దానికి ఓ కారణం ఉంది. ఓ సందర్భంలో ఆ అమ్మాయి తల్లి తండ్రులకు పరిచయం చేయడానికి ఆ అమ్మాయి నారాయణమూర్తిని వారి ఇంటికి తీసుకెళ్ళిందట.

అయితే అప్పటికి కాస్త కూడా సంపాదన లేని నారాయణమూర్తి సినమా అవకాశాల కోసం తిరుగుతున్నారట. ఆ అమ్మాయిమాత్రం పెద్ద కోటీశ్వరురాలు కావడం. బంగ్లా, కార్లుతో ఉన్న ఆ ఇంటిని చూసి.. ఆ అమ్మాయి తనకు తగదని.. ఆమెను పెళ్లి చేసుకుని కష్టాల్లోకి నెట్టడం సరైన పద్దతి కాదు అనుకున్నారట నారాయణ మూర్తి. అదే విషయం ఆ అమ్మాయికి కూడా చెప్పి ఒప్పించారట.

అలా నారాయణ మూర్తి లైఫ్ టైమ్ బ్యాచిలర్ గా మిగిలిపోయారు. ఆతరువాత పెళ్లి కూడా చేసుకోలేదు ఆయన. విప్లవ సినిమాలో నలుగురు నమస్కారం పెట్టేంత పేరును సంపాదించారు నారాయణమూర్తి. అంతే కాదు ఎప్పుడు కమర్షియల్ వైపు వెళ్లలేదు. కోట్లు ఆఫర్ చేసినా.. కమర్షియల్ సినిమాలు చేయలేదు నారాయణ మూర్తి. జీవితాంతం తను నమ్ముకున్న సిద్దాంతాలకు కట్టుబడి ఉన్నాడు. అయితే తన ప్రేమ కథ గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారట నారాయణ మూర్తి.

Updated On 24 Dec 2024 6:03 AM GMT
ehatv

ehatv

Next Story