Sexologis Dr. Samaram : సెక్సాలజిస్ట్ డా.సమరం.. ఏ సినిమాలో నటించాడో తెలుసా.. అన్నీ 'ఆ' సీన్లే..!
డా.సమరం గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వ్యక్తి లేరంటే అతిశయోక్తి కాదు.
డా.సమరం గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వ్యక్తి లేరంటే అతిశయోక్తి కాదు. గోపరాజు సమరం 1970లో విజయవాడలో వైద్యుడిగా తన కెరీర్ ప్రారంభించారు. కాకినాడలోని రంగరాయ వైద్యకళాశాల నుంచి ఎంబీబీఎస్ పట్టా పొందారు. ఈ సోషల్ మీడియా యుగంలో సెక్స్‌పై రకరకాల వీడియోలు, అవగాహన కార్యక్రమాలు ఉంటున్నాయి. కానీ టీవీలు, సోషల్ మీడియాలేని కాలంలో ఆయన సెక్స్‌పై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేసేవారు. స్వాతి వార పత్రికకు ఇప్పటికీ ఇంత ఆదరణ ఉందంటే దాంట్లో సమరం పాత్ర కీలకంగా ఉంటుంది. శృంగార సందేహాలను స్వాతి బుక్‌కు రాయగా ఆయన వాటికి స్వయంగా సమాధానాలు రాస్తారు. ప్రతివారం స్వాతి మ్యాగజైన్‌న్‌ను శృంగారంపై ప్రశ్నలు, సమరం సమాధానాల కోసమే కొనేవారు కోకొల్లలుగా ఉన్నారు. ఉచిత వైద్యశిబిరాలు, టీకా క్యాంపులు, నేత్ర శిబిరాలు, రక్తదాన శిబిరాలు, హెచ్‌ఐవీ పరీక్షల శిబిరాలు నిర్వహించి సామాజిక సేవలు చేశారు. చాలా ఏళ్లుగా రెండు రూపాయలకే వైద్యం అందిస్తున్నారు. 80 ఏళ్ల ఉన్నా కానీ రోజుకు 18 గంటలు పని చేస్తూ తెలుగు ప్రజలకు ఇప్పటికీ ఎన్నో సందేహాలు తీరుస్తున్నారు డాక్టర్ సమరం. అయితే ఆయన ఓ సినిమాలో కూడా నటించాడు. 'మీ కోసం' సినిమాలో ఆయన నటించారు. ఆ సినిమాలో చాలా వరకు శృంగార సన్నివేశాలు ఉండడం విశేషం.