కూర‌లు చేసేందుకు మ‌నం రోజూ ఉల్లిపాయ‌ల‌ను ఉపయోగిస్తాం కదా. ఉల్లిపాయ‌లు లేకుండా మ‌నం కూర‌లను వండుకోలేం. ప్ర‌తి కూర లేదా వంట‌కంలోనూ ఉల్లి క‌చ్చితంగా ఉంటుంది.

కూర‌లు చేసేందుకు మ‌నం రోజూ ఉల్లిపాయ‌ల‌ను ఉపయోగిస్తాం కదా. ఉల్లిపాయ‌లు లేకుండా మ‌నం కూర‌లను వండుకోలేం. ప్ర‌తి కూర లేదా వంట‌కంలోనూ ఉల్లి క‌చ్చితంగా ఉంటుంది. ఉల్లిపాయ‌ల్లోనూ అనేక ర‌కాలు ఉంటాయి. ఉల్లిపాయలను తేనె(Honey)లో నానబెడితే ఏం జరుగుతుందో తెలుసా. కాస్త చిన్న‌గా ఉన్న ఉల్లిపాయ‌ల‌(Onions)ను తీసుకోవాలి. వీటిని ఒక సీసాలో వేసి ఇవి మునిగేంత వ‌ర‌కు తేనె పోయాలి. ఇలా ఉల్లిపాయ‌ల‌ను తేనెలో ఒక రోజంతా నాన‌బెట్టాలి. త‌రువాత వాటిని ఫ్రిజ్‌లో నిల్వ చేసి రోజుకు ఒక‌టి చొప్పున ఉద‌యం ప‌ర‌గ‌డుపునే తింటుండాలి. ఒక‌సారి ఇలా మిశ్ర‌మాన్ని త‌యారు చేసి పెట్టుకుని వారం రోజుల వ‌ర‌కు తిన‌వ‌చ్చు. కానీ ఫ్రిజ్‌లో నిల్వ చేసి తినాలి. లేదంటే ఉల్లిపాయ‌లు పాడ‌వుతాయి. అయితే ఇలా తేనెలో నాన‌బెట్టిన ఉల్లిపాయ‌ల‌ను తిన‌డాన్ని కొన్ని వ‌ర్గాల‌కు చెందిన సంప్ర‌దాయ వైద్య విధానంలో పాటిస్తారు. ఈ క్ర‌మంలోనే ఇలా తిన‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు.

తేనెలో నాన‌బెట్టిన ఉల్లిపాయల్లో స‌ల్ఫ‌ర్ స‌మ్మేళ‌నాల శాతం పెరుగుతుంది. ఇవి యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ(Anti-inflammatory), యాంటీ మైక్రోబియ‌ల్ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. ఈ ఉల్లిపాయ‌ల్లో క్వ‌ర్సెటిన్ అన‌బ‌డే స‌మ్మేళ‌నం ఉంటుంది. ఇది శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్‌గా ప‌నిచేయ‌డంతోపాటు యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ గుణాల‌ను సైతం క‌లిగి ఉంటుంది. ఈ మిశ్రమంలో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేస్తుంది. ఈ మిశ్ర‌మంలో ఉండే క్రోమియం షుగ‌ర్ లెవ‌ల్స్‌ను తగ్గిస్తుంది. శ‌రీరం ఇన్సులిన్‌ను ఉప‌యోగించుకునేలా చేస్తుంది. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. ఈ మిశ్ర‌మంలో ఉండే యాంటీ బ్యాక్టీరియ‌ల్‌, యాంటీ వైర‌ల్ గుణాల వ‌ల్ల రోగాలు త‌గ్గుతాయి. ముఖ్యంగా ఇన్ ఫెక్ష‌న్ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

ehatv

ehatv

Next Story