ఫిబ్రవరి 29(February 29) అంటేనే.. వెంటనే గుర్తుకొచ్చేది లీప్ ఇయర్(leap year). అంటే..క్యాలెండర్‎లో అదనంగా ఒకరోజు వచ్చి చేరడమే. సాధారణంగా ఏడాదిలో 365 రోజులు ఉంటే..లీప్ ఇయర్‎లో మాత్రం ఏడాది 366 రోజులు ఉంటాయి. ఏడాదిలో అతి చిన్న నెలగా పేరున్న ఫిబ్రవరిలో ఒక రోజు అదనంగా వచ్చి చేరడం..అంటే ఫిబ్రవరి 29 తారీఖు కూడా ఉంటుందన్నమాట. అయితే అలాగే..వివిధ దేశాల్లో లీప్ ఇయర్‌తో ముడిపడి ఎన్నో సంప్రదాయాలు, మూఢ విశ్వాసాలు ప్రచారంలో ఉన్నాయి.

ఫిబ్రవరి 29(February 29) అంటేనే.. వెంటనే గుర్తుకొచ్చేది లీప్ ఇయర్(leap year). అంటే..క్యాలెండర్‎లో అదనంగా ఒకరోజు వచ్చి చేరడమే. సాధారణంగా ఏడాదిలో 365 రోజులు ఉంటే..లీప్ ఇయర్‎లో మాత్రం ఏడాది 366 రోజులు ఉంటాయి. ఏడాదిలో అతి చిన్న నెలగా పేరున్న ఫిబ్రవరిలో ఒక రోజు అదనంగా వచ్చి చేరడం..అంటే ఫిబ్రవరి 29 తారీఖు కూడా ఉంటుందన్నమాట. దీన్నే లీప్ ఇయర్ అని చెప్పుకుంటాం. ఈ లీప్ ఇయర్ ప్రతి నాలుగేళ్లకు ఒకసారి వస్తుంటుంది. కానీ, నాలుగేళ్లకు ఒకసారి వస్తుందంటోన్న లీప్ ఇయర్‌లో కూడా కొన్ని మినహాయింపులున్నాయి. కాలమాన పరిస్థితులను బట్టి ఒక్కో దేశంలో ఒక్కో కాలంలో ఈ ఫిబ్రవరి 29 వస్తుంటుంది. అలాగే..వివిధ దేశాల్లో లీప్ ఇయర్‌తో ముడిపడి ఎన్నో సంప్రదాయాలు, మూఢ విశ్వాసాలు(Traditions and superstitions) ఉన్నాయి.

ఐరిస్(Iris)లో ఫిబ్రవరి 29న వచ్చే లీప్ డే(leap day)ని..బ్యాచిలర్స్ డే(Bachelor's Day)గా గుర్తిస్తారు. దీన్నే కొన్నిసార్లు లేడిస్ ప్రివిలేజ్(Ladies Privilege) గా చెబుతుంటారు. ఈ సంప్రదాయం ప్రకారం ఆ రోజు అబ్బాయిలకు అమ్మాయిలు ప్రపోజ్ చేస్తారు. ఈ రోజుల్లో ఏ రోజైనా అమ్మాయిలు అబ్బాయిలకు ప్రపోజ్ చేయడం షరా మామూలే. కానీ, 5వ శతాబ్దంలో కూడా ఈ సంప్రదాయమే కొనసాగేది. సెయింట్ బ్రిడ్జెట్(St. Bridget), సెయింట్ పాట్రిక్‌ల సిద్ధాంతాల(Doctrines of St. Patrick)కు అనుగుణంగా ఈ సంప్రదాయం వచ్చిందని ఐరిస్ ప్రజలు చెబుతుంటారు. లీప్ డే నాడు ఎవరైనా అమ్మాయిలు ప్రపోజ్ చేస్తే అబ్బాయిలు నిరాకరించకూడదట. ఒకవేళ అమ్మాయిల ప్రపోజల్‌ను నిరాకరిస్తే..అందుకు తగిన పరిహారం అమ్మాయిలకు చెల్లించే సంప్రదాయం కూడా ఉంది. అంటే, ప్రపోజల్‌ను తిరస్కరించిన అబ్బాయి అమ్మాయికి హ్యాండ్ గ్లౌవ్స్(Hand gloves) లేదా సిల్క్ గౌన్‌(Silk gown)కొనివ్వాల్సి ఉంటుంటుందట. సాధారణంగా ప్రపోజ్ చేయడంలో అబ్బాయిలు చాలా నిదానంగా ఉంటారు. దీని వల్లే ఐరిష్‎లో అమ్మాయిలు పెళ్లి కోసం చాలా కాలం వేచిచూడాల్సి వచ్చేదట. అందుకే సెయింట్ పాట్రిక్ వద్దకు వెళ్లి బ్రిడ్జెట్ ఫిర్యాదు చేసినట్లు చెబుతారు. మహిళలకు ప్రపోజ్ చేసే అవకాశం కల్పించాలని కోరినట్లు ప్రచారం ఉంది. ఐర్లాండ్‌లో ఇప్పటికీ లీప్‌ డే నాడు అమ్మాయిలు అబ్బాయిలకు ప్రపోజ్ చేసే సంప్రదాయం కొనసాగుతోంది. ఇక లీప్ డేపై గ్రీస్(Greece)లో మరో ఆసక్తికర నమ్మకం ప్రచారంలో ఉంది. ముఖ్యంగా లీప్ డే నాడు పెళ్లి చేసుకోవడానికి గ్రీకులు అంగీకరించరు. ఎందుకంటే.. ఆ రోజు పెళ్లి చేసుకుంటే విడాకులు తప్పవనేది వారి నమ్మకం. అలాగే లీప్ డే మంత్రగత్తలకు అనుకూలమైన రోజుగా(Scotland people) భావిస్తుంటారు. అందుకే ఫిబ్రవరి 29న బిడ్డకు జన్మనివ్వడాన్ని స్కాట్లాండు ప్రజలు దురదృష్టంగా భావిస్తారట. అయితే కొన్ని సంప్రదాయాల్లో ఫిబ్రవరి 29న పుట్టడాన్ని లక్కీ బర్త్ డే(Lucky birthday)గా గుర్తిస్తారు. లీప్ డే నాడు పుట్టినరోజు వస్తే, అలాంటి వారిని ప్రత్యేకమైన వ్యక్తులుగా కొందరు ఖగోళ శాస్త్రవేత్తలు(Astronomers)కూడా విశ్వసిస్తుండంటం ఆశ్చర్యకరం.

Updated On 4 Jan 2024 6:52 AM GMT
Ehatv

Ehatv

Next Story