Lee Hao Death : నాన్‌స్టాప్‌గా అన్లైన్ గేమ్స్ ఆడాడు.. ప్రాణాలు తీసుకున్నాడు..
అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు పెద్దలు.. ఏదీ అతి చేయకూడదన్నమాట! చైనాలో(China) ఇలాగే ఒకతను ఏకధాటిగా గేమ్(Game) ఆడాడు. ప్రాణాలు విడిచాడు. తను పనిచేసే మీడియా కంపెనీ(Media company) కోసం ఈ పని చేశాడు.

Lee Hao Death
అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు పెద్దలు.. ఏదీ అతి చేయకూడదన్నమాట! చైనాలో(China) ఇలాగే ఒకతను ఏకధాటిగా గేమ్(Game) ఆడాడు. ప్రాణాలు విడిచాడు. తను పనిచేసే మీడియా కంపెనీ(Media company) కోసం ఈ పని చేశాడు. ఈ ఘటన నవంబర్ 10వ తేదీన జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దర్ఘటన వివరాలను ది పేపర్ వార్తా సంస్థ ప్రచురించింది. ఆ వార్త కథనం ప్రకారం లీ హావో(Lee Hao) అనే విద్యార్థి హెనాన్(Henan) రాష్ట్రంలో ఉన్న పింగ్‌డింగ్ షాన్ వొకేషన్, ట్రైనింగ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు. వచ్చే ఏడాది జూన్‌లో ఇది పూర్తవుతుంది. కోర్సు ముగిసేలోపు ఏదైనా గేమ్స్ సంబంధ మీడియా సంస్థలో ఇంటర్న్‌షిప్(Internship) చేయాల్సి ఉంటుంది కాబట్టి క్విన్‌యీ కల్చర్ అండ్ మీడియా(Queenie Culture and Media) కంపెనీలో చేరాడు లీ హావో. టెంపరరీ ఎంప్లాయిగా ఆన్‌లైన్ గేమ్స్ ఆడే లైవ్ స్ట్రీమర్‌గా(Live streaming) పని చేయసాగాడు. మొదట్లో మార్నింగ్ షిప్ట్‌లో పని చేసిన లీ హావో తర్వాత కంపెనీ ఆదేశాల ప్రకారం నైట్‌షిఫ్ట్ పని చేశాడు. కంపెనీ చెప్పినట్టు రాత్రిళ్లు గేమ్స్ ఆడేవాడు. మూడు వేల యువాన్ల జీతం రావాలంటే 26 రోజుల్లో 240 గంటలపాటు ఆన్‌లైన్ గేమ్స్ ఆడాల్సి ఉంటుంది. నెలకు 15 చొప్పున షార్ట్ వీడియోలు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ప్రతి రోజూ రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఏకధాటిగా ఆన్‌లైన్ గేమ్స్ ఆడాలి. దీంతో లీ హావో గత అయిదు రోజులుగా ఏకధాటిగా గేమ్స్ ఆడుతూ శ్వాస పీల్చుకోవడం ఇబ్బందై కుప్పకూలిపోయాడు. ఇతడిని ఆస్పత్రికి తరలించినా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు చెప్పారు. ఘటనపై కంపెనీ మాత్రం తమకేం సంబంధం లేదని అంటోంది. బాధితుని కుటుంబానికి 5,000 యువాన్లు నగదు సాయం అందిస్తామని చేతులు దులుపుకుంది!
