True Friendship : తగ్గిపోతున్న స్నేహ బంధాలు..!
ప్రపంచ వ్యాప్తంగా మనుషులు ఎదుర్కొంటున్న సాధారణ సమస్యల్లో ఇప్పుడు పెద్ద చిక్కే వచ్చి పడింది.

ప్రపంచ వ్యాప్తంగా మనుషులు ఎదుర్కొంటున్న సాధారణ సమస్యల్లో ఇప్పుడు పెద్ద చిక్కే వచ్చి పడింది. మనుషులకు ఇప్పుడు స్నేహితులు దొరకడం లేదట. సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్ లేని కాలమైన 1960 ప్రాంతంలో ఒక్కక్కరికి 100 మంది స్నేహితులు ఉండేవారట. 1990 లలో ఒక్కొక్కరికి 5 గురు స్నేహితులు ఉండేవారు. ఇప్పుడు ఒక్కరు ఉండటం కూడా గగనమే. దేశంలో 12% జనాభాకు స్నేహితులు లేరని ఒక సర్వేలో తేలింది.
మంచి స్నేహితులు లైఫ్ ఇన్సూరెన్స్ లాంటి వారు. స్నేహితులు లేనివారు రోజుకు 20 సిగరెట్లు తాగినంత స్ట్రెస్ అనుభవిస్తారట. మంచి స్నేహితులు ఉన్నవారిలో బీపీ, గుండె వ్యాధులు తక్కువని పరిశోధనలు తెలుపుతున్నాయి. స్నేహితులు తోడుగా ఉన్నవారు ఆహ్లాదంగా ఉంటారు, వ్యాయామం, క్రీడలు, ఇతర కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. వారితో గడపడంతో మనుషుల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
కానీ స్నేహితులు ఊరికినే ఏర్పడరు. స్నేహం ఏర్పర్చుకోవాలంటే సమయం కేటాయించాలి. కనీస పరిచయం ఏర్పడాలంటే 40 గంటలు కలసి గడపాలి, ఒక మాదిరి స్నేహం ఏర్పడాలంటే ఇంకో 90 గంటలు, గట్టి స్నేహం ఏర్పడాలంటే ఇంకో 40 గంటలు కావాలట. మన దగ్గర ఇంత సమయం ఉందా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఒక సారి మంచి స్నేహం ఏర్పడ్డాక దానిని నిలుపుకోవాలంటే రోజూ కొంత సమయం కేటాయించాలి.
ఇక మనం పని చేసే ప్రాంతంలో మనం స్నేహం అనుకునేది చాలా వరకు ఉపరితల ముచ్చటే. ఇక ఫేస్ బుక్, వాట్సాప్ స్నేహాల గురించి చెప్పనవసరం లేదు. మొత్తం మీద స్నేహానుభంధాలు తగ్గిపోతున్నాయి. ఇందుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ " సమయం లేదు మిత్రమా" అనేదే అతి పెద్ద కారణం
