ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ఇంద్రావతి నేషనల్ పార్క్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సీపీఐ (Maoist ) కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు లక్ష్మీ నరసింహాచలం అలియాస్ సుధాకర్ (Sudhakar)అలియాస్ గౌతమ్(Gowtham) (67) మృతి చెందాడు.

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ఇంద్రావతి నేషనల్ పార్క్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సీపీఐ (Maoist ) కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు లక్ష్మీ నరసింహాచలం అలియాస్ సుధాకర్ (Sudhakar)అలియాస్ గౌతమ్(Gowtham) (67) మృతి చెందాడు. ఈ ఘటన మావోయిస్టు ఉద్యమానికి పెద్ద ఎదురుదెబ్బగా మిగిలింది. బస్తర్ రేంజ్‌లోని సీనియర్ మావోయిస్టు నాయకుల ఉనికి గురించి నిఘా సమాచారం ఆధారంగా, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), కోబ్రా (CRPF ఎలైట్ యూనిట్) ఉమ్మడి బృందం ఆపరేషన్ చేపట్టింది. సుధాకర్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర(Telangana) కమిటీ సభ్యుడు బండి ప్రకాశ్(Bandi Prakash), దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు పప్పారావు(Paparao), ఇతర సాయుధ క్యాడర్ ఉన్నట్లు సమాచారం. ఎన్‌కౌంటర్‌లో సుధాకర్ మృతి చెందగా, ఒక AK-47 రైఫిల్, ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

మావోయిస్ట్ సుధాకర్ ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని ఏలూరు(Eluru) జిల్లా చింతలపూడి (Chinthalapudi)మండలం ప్రగడవరం (pragadavaram)గ్రామానికి చెందినవాడు. 40 సంవత్సరాలకు పైగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్నాడు. 1995లో చేరిన అతను 2021లో కేంద్ర కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొందాడు. మావోయిస్టుల భావజాల శిక్షణ, క్రాంతి మ్యాగజైన్‌ను నిర్వహించాడు. సుధాకర్‌పై రూ. 40 లక్షల నుంచి రూ. 1 కోటి వరకు రివార్డ్ ఉంది. అతను ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మహారాష్ట్రల(Maharastra)లో వివిధ కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నాడు.

సుధాకర్.. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నాడు. సిలేరు, మక్కువ, ఎల్విన్‌పేట, అన్నవరం పోలీస్ స్టేషన్ల పరిధిలో నాలుగు తీవ్రమైన కేసుల్లో అతని పేరు ఉంది, ఇందులో హత్య, దోపిడీ, పేలుడు పదార్థాల వినియోగం వంటివి ఉన్నాయి. అతను యువతను తప్పుదారి పట్టించి, హింసాత్మక భావజాలాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషించాడు.

సుధాకర్ మరణం.. నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మరణం తర్వాత రెండవ పెద్ద ఎదురుదెబ్బ. ఈ ఏడాది బస్తర్ రేంజ్‌లో 186 మావోయిస్టులు, 2024-2025లో 403 మందిని హతమార్చారు. ఇది 2026 మార్చి నాటికి భారతదేశాన్ని నక్సల్ రహితంగా మార్చాలనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా లక్ష్యం పెట్టుకున్నాడు.

ehatv

ehatv

Next Story