Rat Cage Shoe : ఎలుక బోన్లతో షూస్ ధరించిన మహిళ..!
సోషల్ మీడియా(Social media) వచ్చిన తర్వాత ప్రజలకు ప్రపంచం అరచేతిలోకి వచ్చింది. సోషల్ మీడియాలో పరపతి పెంచుకునేందుకు కొందరు వింతవింత పోకడలు పోతుంటారు. కొందరికి పిచ్చి పీక్‌కు వెళ్లి పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు నానా తంటాలు పడుతుంటారు. తాజా అమెరికాలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. దీంతో ఈ వీడియో ఇప్పటికే ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది.

Rat Cage Shoe

న్యూయార్క్‌లో(New York) ఓ మహిళ తన షూస్‌ను(Shoes) ప్రత్యేకంగా తయారుచేయించుకుంది. తన షూస్‌ను ఎలుక బోన్లతో(Rat cage) ధరించింది. అంతేకాదు ఎలుకబోన్లలో ఎలుకలను కూడా మనం చూడొచ్చు. ఎలుక బోన్లతో షూస్ తయారుచేయించుకొని న్యూయార్క్ వీధుల్లో ఈ మహిళ దర్జాగా తిరుగుతోంది. అటుగా వెళ్తున్న వారందరి దృష్టిని ఈ మహిళ షూస్ ఆకర్షిస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) @inmyseams ఖాతా పేరుతో ఈ వీడియోను షేర్ చేశారు. ఇన్‌స్టాగ్రాంలో ఈ వీడియోకు 20 లక్షలకుపైగా లైక్‌లు, లక్షల్లో కామెంట్స్ వస్తున్నాయి.