చీర ధరించడం సంప్రదాయం అంటారు. చీర అంటేనే అందమని కూడా అంటారు. భారతీయ సంస్కృతికి చిహ్నం అని చెబుతుంటారు. చీరతో ఈ తరం వారికి అనుభూతులు, అనుబంధాలు, అనుభవాలు పెద్దగా ఉండకపోవచ్చు కానీ ఆ తరంవారు చీరను ఓ తమ అనుభూతుల్లో ఓ భాగం చేసుకున్నారు.

చీర ధరించడం సంప్రదాయం అంటారు. చీర అంటేనే అందమని కూడా అంటారు. భారతీయ సంస్కృతికి చిహ్నం అని చెబుతుంటారు. చీరతో ఈ తరం వారికి అనుభూతులు, అనుబంధాలు, అనుభవాలు పెద్దగా ఉండకపోవచ్చు కానీ ఆ తరంవారు చీరను ఓ తమ అనుభూతుల్లో ఓ భాగం చేసుకున్నారు. మొదటిసారి కట్టుకున్న చీరను, మొట్టమొదటిగా కట్టుకున్న అమ్మ చీరను, పెళ్లి చీరను, మధుపర్కార చీరను, మొదటి జీతంతో కొనుక్కున్న చీరను, భర్త కొనిచ్చిన మొదటి చీరను ఎంత పదిలంగా చూసుకున్నారో వారిని అడిగితే తన్మయత్వంతో కథలు కథలుగా చెపుతారు. పాత జ్ఞాపకాలను మళ్లీ నెమరేసుకుంటారు. లక్షల రూపాయల చీరైనా, మూడు వందల చీరైనా అమ్మాయిలు కట్టుకుంటే లక్షణంగా ఉన్నాయనిపిస్తాయి. అది చీర గొప్పతనం. అది చిరస్మరణీయం. ఇవాళ ఎందుకు చీర గురించి చెప్పడానికి ఓ కారణం ఉంది. ఈ రోజు, ఈ రోజే కాదు ప్రతి ఏడాది డిసెంబర్‌ 21వ తేదీన ప్రపంచ చీర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అసలు ఈ దినోత్సవం ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? ఎందుకు జరుపుకుంటున్నాము?
సిందూర కవిటి, నిస్తుల హెబ్బార్‌ అనే ఫ్యాషన్‌ ప్రియులు 2020లో వరల్డ్‌ చీర దినోత్సవం ఉద్యమాన్ని మొదలు పెట్టారు. ఇందుకోసం వారు ఓ ప్రత్యేక తేదీని కూడా సూచించారు. చీరకు సంబంధించిన సాంస్కృతిక ప్రాముఖ్యతను ప్రపంచాన్ని తెలియచేయడానికే ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రపంచానికి సీతాకోకచిలుకలు ఎంత అందాన్ని తీసుకొస్తాయో రంగురంగుల చీరలు కూడా అంతే అందాన్ని తీసుకొస్తాయి. చీరకు ఎన్ని వేల ఏళ్ల చరిత్ర ఉందో తెలియదు కానీ క్రీస్తూపూర్వంలోనే చీర కట్టడం ఉంది. ప్రపంచ చీర దినోత్సవం జరుపుకోవడం వెనుక సదుద్దేశం కూడా ఉంది. ఎంతో కష్టపడి చీరను తయారు చేసే కార్మికుల నైపుణ్యాన్ని గుర్తించడమే ప్రధాన ఉద్దేశం. ఎంత శ్రమపడితే, ఎంత ఓపికవహిస్తే కానీ ఓ అందమైన చీర రూపుదిద్దుకోదు. మన దేశంలో ఒకప్పుడు చీరను జాకెట్టు లేకుండానే ధరించేవారు. పెట్టికోటు కూడా ఉండేది కాదు. చీర చాలా మందంగా ఉండేది. మోకాలి వరకు చీరను ధరించేవారు. అయితే ఆ చీర కట్టుకుని బయటకు రావడం ఇబ్బందిగా ఉండేది. అప్పట్లో ఆడవారు ఇంట్లోనే ఉండేవారు కాబట్టి నడిచిపోయింది. మహిళలు వంటింట్లోంచి బయటకు వచ్చి, పురుషులతో పాటుగా సమానంగా ఉద్యోగాలు చేస్తుండటంతో చీరలో కూడా మార్పలు వచ్చాయి. కట్టడంలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. తమకు సౌకర్యంగా, సౌలభ్యంగా చీరలు కట్టుకోవడం మొదలుపెట్టారు మహిళలు. ఆధునికంగా చీర కట్టుకునే విధానం ఎప్పుడు మొదలయ్యిందో కచ్చితంగా తెలియదు కానీ రవీంద్రనాథ్‌ టాగూర్‌ కుటుంబమే మొదలు పెట్టిందని ప్రొఫెసర్‌, రచయిత జస్వీందర్‌ కౌర్‌ చెబుతున్నారు. రవీంద్రనాథ్‌ టాగూరు కోడలు జ్ఞానదానందిని దేవితోనే ఆధునిక చీర కట్టు విధానానికి ప్రాచుర్యం లభించిందని అంటున్నారు. చీరను ప్రస్తావిస్తూ మన తెలుగు సినిమాల్లో బోల్డన్ని పాటలు కూడా వచ్చాయి. తూర్పు వెళ్లే రైలులోని చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ అనే పాటను ఎవరైనా మర్చిపోగలరా? ఎన్ని రకాల దుస్తులు వచ్చినా సరే.. చీర చీరే! చీర సౌందర్యం ముందు మిగతా వస్త్రాలన్నీ బలాదూర్‌!

Updated On 21 Dec 2023 1:25 AM GMT
Ehatv

Ehatv

Next Story