లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara) - కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(dhanush) మధ్య నెలకొన్న వివాదం తెలిసిందే!
లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara) - కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(dhanush) మధ్య నెలకొన్న వివాదం తెలిసిందే!
నయనతార జీవితం ఆధారంగా రూపొందించిన ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీ(Documentry) విషయంలో వివాదం మొదలయ్యింది
ఇప్పుడు అది మరింత ముదిరింది. ఇద్దరు తగ్గడం లేదు. అదే పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో కర్మ సిద్ధాంతాన్ని ఉదహరిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్(Istagram) అకౌంట్ లో నయనతార ఒక పోస్ట్ పెట్టింది. అది సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ‘కర్మ సిద్ధాంతం ఏం చెబుతుందంటే.. అబద్ధాలతో పక్కవారి జీవితాన్ని నువ్వు ధ్వంసం చేస్తే.. దానిని ఓ అప్పుగా భావించు. అది సరైన సమయంలో వడ్డీతో సహా నీ దగ్గరకే వస్తుంది’ అంటూ నయనతార రాసుకొచ్చింది. ధనుష్‌ను ఉద్దేశించే ఆమె ఈ పోస్ట్‌ను పెట్టిందని అందరూ అనుకుంటున్నారు.
‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీలో నయనతార నటించిన ‘నానుమ్ రౌడీ దాన్’(Nanum rowdy dhaan) సినిమా క్లిప్పింగులను. కొన్నింటిని వాడుకున్నారు. ఆ సినిమా అప్పుడే దర్శకుడు విఘ్నేష్‌శివన్‌తో(Vignesh shivan) ప్రేమలో పడింది నయనతార. ఆ కారణంగా
ఆ సినిమా క్లిప్స్‌ను తన డాక్యుమెంటరీలో వాడుకోవాలని అనుకుంది నయనతార. అయితే అందుకు చిత్ర నిర్మాత ధనుష్ నుంచి అనుమతి లభించలేదు. మూడు సెకన్ల పాటు వాడిన వీడియో క్లిప్‌ను తీసివేయాలని, లేకుంటే పరిహారంగా 10కోట్ల రూపాయలు చెల్లించాలని నయనతారకు ధనుష్ లీగల్ నోటీసులు పంపించాడు. దాంతో ధనుష్ వ్యవహార శైలిని తప్పుపడుతూ ఓ బహిరంగ లేఖను విడుదల చేసింది నయనతార. అక్కడ మొదలైన వివాదం ధనుష్ వరుసగా ఇస్తున్న కోర్టు నోటీసులతో ముదురుతోంది.