'8 వసంతాలు' ఈరోజు థియేటర్లలో విడుదలైంది, ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఎమోషనల్ లవ్ డ్రామా.

'8 వసంతాలు' ఈరోజు థియేటర్లలో విడుదలైంది, ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఎమోషనల్ లవ్ డ్రామా. అనంతిక సనీల్ కుమార్ (Mad Fame) హీరోయిన్‌గా, హను రెడ్డి హీరోగా నటించారు. శుద్ధి అయోధ్య (Ananthika) తన తండ్రి మరణం తర్వాత బాధ నుంచి బయటపడేందుకు రచయిత్రిగా మారుతుంది. 17 ఏళ్ల వయసులోనే ఓ పుస్తకం రాసి పేరు తెచ్చుకుంటుంది. వరుణ్ (Hanu Reddy) ఇండియాలో ఆస్తులు అమ్మేందుకు ఊటీ వస్తాడు.. అక్కడ శుద్ధితో ప్రేమలో పడతాడు.ఈ కథ ఎనిమిది సంవత్సరాల జీవిత ప్రయాణంలో ప్రేమ, బ్రేకప్, బాధ్యతలు, త్యాగాల చుట్టూ తిరుగుతుంది. స్త్రీ కోణంలో సున్నితమైన భావోద్వేగాలను చూపించే ప్రయత్నం జరిగింది. ప్రతి ఫ్రేమ్ చిత్రలేఖనంలా ఉందని, కెమెరా వర్క్ అద్వితీయమని ప్రశంసలు వస్తున్నాయి. ఊటీ నేపథ్యం విజువల్ బ్యూటీని పెంచింది. హేషమ్ అబ్దుల్ వాహాబ్ సంగీతం సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. పాటలు వినసొంపుగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎమోషనల్ సీన్స్‌ని ఎలివేట్ చేసింది. అనంతిక సనీల్ కుమార్ నటన హృదయాన్ని తాకుతుందని, ఆమె పాత్రలో జీవించింది. హను రెడ్డితో కెమిస్ట్రీ ఫస్టాఫ్‌లో బాగుంది. ఫణీంద్ర రాసిన డైలాగ్స్‌లో కవితాత్మకంగా ఉన్నాయి. కొన్ని లవ్ సీన్స్, క్లైమాక్స్ ఎమోషనల్‌గా ఆకట్టుకున్నాయి. సినిమా స్వచ్ఛమైన ప్రేమకు నిర్వచనం చెప్పే ప్రయత్నం చేసింది. క్లైమాక్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఫస్టాఫ్‌ బోరింగ్‌ లేకుండా సాగినా సెకండాఫ్‌లో కొంత ల్యాగ్‌ ఉండడమే నెగెటివ్.. కానీ క్లైమాక్స్‌ మాత్రం చాలా బాగుండడం విశేషం.

ehatv

ehatv

Next Story