మిల్కీ బ్యూటీ తమన్నా(Tamannaa) క్రమం తప్పకుండా ప్రతిరోజూ వార్తల్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ వెబ్ సిరీస్‌లతో(Web series) చాలా బిజీగా ఉన్నారు. ఈ మధ్యే జీ కర్దా(Jee Karda) సిరీస్‌తో బాగా పాపులరయ్యారు. అందులో ఫుల్ రొమాంటిక్ సీన్స్‌లో నటించి విమర్శలను ఎదుర్కొన్నారు తమన్నా. ఇప్పుడు లస్ట్ స్టోరీస్‌లోనూ(Lust stories) అంతే.. ఈ సిరీస్‌లో తన ప్రియుడు విజయ్ వర్మతో(Vijay Varma) కలిసి నటించారు తమన్నా.

Tamannaah New Controversy

ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఇందులో కూడా తమన్నా బోల్డ్ సీన్స్‌లో నటించారు. ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా తాజాగా దీనికి సంబంధించిన ఓ ప్రోమోను(Promo) రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ గురించి నాలుగు మాటలు చెప్పారు. 'ఇందులో అమ్మ, నాన్నతో పాటు అందరి ప్రేమ ఉంది. లస్ట్ స్టోరీస్ జూన్ 29న నెట్‌ఫ్లిక్స్‌లో రాబోతోంది' అని తమన్నా అన్నారు. అయితే ప్రోమో ప్రారంభంలోనే తమన్నా విజయ్‌తో కలిసి నటించిన బోల్డ్ సిన్‌ను(Bold scene)) చూపించారు.
అందులో తమన్నా ముద్దుపెడుతున్న(Kissing) దృశ్యంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇప్పటి వరకు తమన్నా ఇలాంటి సన్నివేశాలలో నటించలేదని అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మీరు భారతీయ సంస్కృతిని నాశనం చేస్తున్నారని కొందరు కామెంట్ చేశారు. నిన్ను ఇలా చూస్తున్నందుకు సిగ్గు పడుతున్నామని మరి కొందరు వ్యాఖ్యానించారు.
మీరు సీ గ్రేడ్ నటులతో ఇలాంటి సీన్స్ ఎలా చేస్తారంటూ మరో నెటిజన్ మండిపడ్డారు. తమన్నా దయచేసి కోలీవుడ్, టాలీవుడ్‌కి తిరిగి వచ్చేయండి అంటూ ఓ నెటిజన్ వేడుకున్నాడు. ఇలాంటి వాటితో మీ ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గిపోతోందంటూ మరో నెటిజన్ బాధపడ్డారు.