ఎట్టకేలకు స్టార్ట్ అయ్యింది.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఉస్తాద్ భగత్ సింగ్ (Ustad BhagatSingh)మూవీ షూటింగ్. పరుగులు పెడుతున్న ఈమూవీ షూటింగ్ నుంచి అప్పుడే ఓ లీకేజ్ బయటకు వచ్చింది.

pawan kalyan
ఎట్టకేలకు స్టార్ట్ అయ్యింది.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bhagat Singh)మూవీ షూటింగ్. పరుగులు పెడుతున్న ఈమూవీ షూటింగ్ నుంచి అప్పుడే ఓ లీకేజ్ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పాలిటిక్స్ ను(Politics) .. సినిమాలను(Movies) రెండింటిని బ్యాలన్స్ చేస్తూ.. పక్కా ప్లానింగ్ తో వెళ్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇక నెక్ట్స్ ఇయర్ ఎలక్షన్స్ ఉండటంతో.. ప్రచార రథంతో రెడీగా ఉన్నాడు ఉస్తాద్. ఈలోపు సినిమా షూటింగ్స్ అన్నీ క్లియర్ చేయాలని చూస్తున్నాడు. అందులో భాగంగా.. ఒక్కొక్కటిగా కంప్లీట్ చేస్తున్నాడు. ఈక్రమంలో తాను మూడేళ్ల కిందట కమిట్ అయిన హరీష్ శంకర్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ కు ఎక్కువ రోజులు డేట్స్ ఇచ్చాడట పవర్ స్టార్. 20 రోజులు పైనే ఈసినిమాకు పనిచేయబోతున్నట్టు తెలుస్తోంది.
ఇక హరీష్ శంకర్ ఎన్నో ఏళ్ళ నిరీక్షణ తరువాత ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ పైకి వెళ్లింది. పవర్ స్టార్ సెట్ లోకి వచ్చారు. దాంతో షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్నాడు హరీష్. ఇక ఈక్రమంలో రెగ్యూలర్ షూటింగ్ నుంచి ఓ లీకేజ్ బయటకు వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాన్ లుక్ ఒకటి బయటకు వచ్చింది.
ఈ ఫొటోలో పవన్ లైట్ గడ్డంతో లుంగీ కట్టుకుని డిఫెంట్ గా కనిపిస్తున్నాడు. షూటింగ్ నుంచి లుక్ బయటకు రావడంతో పవర్ స్టార్ అభిమానులు ఈ లుక్స్ చుసి పవన్ అభిమానులు దిల్ ఖుష్ అతవుతున్నారు. మా పవన్ మాస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టిఇంటే వైరల్ అవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ ను విషయంలో క్లారిటీ ఇ్వవలేదు. శ్రీలీలను ఒక హీరోయిన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో కూడా అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇంకా రాలేదు. ఈసినిమాకు దేశిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ హిట్టుగా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఈ కాంబినేషన్ కు క్రేజ్ బాగా ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అనౌన్స్ చేసి కూడా మూడు నాలుగేళ్ళు అవుతోంది. పవర్ స్టార్ పాలిటిక్స్ లో బిజీగా ఉండటంతో.. ఈసినిమా పెండింగ్ పడిపోయింది. ఇక ఈనెలలో సినిమాలపై గట్టిగా దృష్టి పెట్టాడు పవర్ స్టార్.
