జులై నుంచి అభిషేక్ బచ్చన్(abhishek bachchan), ఐశ్వర్యారాయ్(aishwarya rai) విడిపోయారనే పుకార్లు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.

జులై నుంచి అభిషేక్ బచ్చన్(abhishek bachchan), ఐశ్వర్యారాయ్(aishwarya rai) విడిపోయారనే పుకార్లు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. దీనిపై వారిద్దరూ స్పందించనప్పటికీ, ఇద్దరూ పుకార్లకు స్వస్తి చెప్పే ప్రయత్నమైతే చేస్తున్నారు. సెప్టెంబరులో పారిస్ ఫ్యాషన్ వీక్‌లో జరిగిన ఎల్'ఓరియల్ ఫ్యాషన్ షోలో ఐశ్వర్య తన వివాహ ఉంగరాన్ని(wedding ring) ప్రదర్శించింది. ఇప్పుడు, అభిషేక్ తన 13 ఏళ్ల కుమార్తె ఆరాధ్యతో కలిసి ఇంట్లో ఉంటున్నందుకు తన భార్య పట్ల కృతజ్ఞతలు తెలిపాడు. తాను పుట్టినప్పుడు తన తల్లి జయా బచ్చన్ చేసిన త్యాగాలను కూడా అభిషేక్‌ గుర్తుచేసుకున్నారు. "మా అమ్మ నేను పుట్టగానే నటించడం మానేసింది, పిల్లలతోనే గడిపింది. నాన్నను మిస్‌ అవుతున్నామన్న ఆలోచన మాకు ఎప్పుడూ అనిపించలేదని అభిషేక్‌ అన్నారు.

నేను బయటకు వెళ్లి సినిమాలు తీయడం నా అదృష్టం, కానీ ఐశ్వర్య సినిమాలు ఆపేసి ఆరాధ్యతో ఇంట్లోనే ఉంటోంది. ఇందుకు ఆమెకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నా. పిల్లలు మనకు గొప్ప స్ఫూర్తిని ఇస్తారు. మన బిడ్డ కోసం అవసరమైతే ఒంటికాలిపై పర్వతాలు ఎక్కుతామన్నారు. ఈ వ్యాఖ్యలను బట్టి వీరి విడాకులకు తెరపడిందనే చెప్పాలి. 1994లో ప్రపంచ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకున్న ఐశ్వర్య రాయ్ 2007లో అభిషేక్ బచ్చన్‌ను వివాహం చేసుకున్నారు. వారి వివాహానికి ముందు ధూమ్ 2, కుచ్ నా కహో, ధాయి అక్షర్ ప్రేమ్ కే వంటి అనేక చిత్రాలలో కలిసి నటించారు. జూలైలో అనంత్ అంబానీ, రాధిక వివాహానికి విడివిడిగా రావడంతో వారి విడిపోవడానికి పుకార్లు వచ్చాయి. గత వారం, ఆరాధ్య 13వ పుట్టినరోజును పురస్కరించుకుని ఐశ్వర్య వరుస ఫోటోలను పోస్ట్ చేసింది. అభిషేక్ ఫంక్షన్‌కు గైర్హాజరు కావడం గమనార్హం.

Updated On
Eha Tv

Eha Tv

Next Story