అభిషేక్‌ ఇటీవల పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో "నా దగ్గర ఉన్నదంతా ఇచ్చేశాను... ఇప్పుడు ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను

అభిషేక్‌ ఇటీవల పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో "నా దగ్గర ఉన్నదంతా ఇచ్చేశాను... ఇప్పుడు ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను" అని పోస్ట్‌ చేశారు. ఈ పోస్ట్ విడాకుల ఊహాగానాలను మరింత రేకెత్తించిందని, ముఖ్యంగా ఐశ్వర్య రాయ్‌(Aishwarya Rai)తో సంబంధంలో సమస్యలు ఉన్నాయనే పుకార్ల నేపథ్యంలో చర్చ జరుగుతోంది. బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan)నటించిన కొత్త సినిమా హౌస్‌ఫుల్ 5 (Housefull 5)కొద్దిరోజుల క్రితమే విడుదలైంది. ఆయన సినిమాకు బాక్సాఫీస్‌లో మంచి ఆదరణ వస్తోంది. ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతుంది. ప్రియమైన వారికోసం అన్నీ ఇచ్చేశానంటూ అందులో పేర్కొన్నాడు. దీంతో కుటుంబ సమస్యల వల్ల ఆయన ఇలాంటి పోస్ట్‌ చేశారా అంటూ నెటిజన్లు సందేహిస్తున్నారు. కొంతకాలంగా నటి ఐశ్వర్యరాయ్‌ అభిషేక్ బచ్చన్‌ల విడాకుల వార్తలు వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఆయన చేసిన పోస్ట్‌ మరింత బలాన్ని ఇచ్చేలా ఉంది.

Updated On
ehatv

ehatv

Next Story