అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారంటూ సినీ నటుడు అలీకి(Actor Ali) నోటీసులు ఇచ్చారు.

అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారంటూ సినీ నటుడు అలీకి(Actor Ali) నోటీసులు ఇచ్చారు. అలీ ఫామ్‌ హౌసులోని(Farm house) పనివాళ్లకు వికారాబాద్ జిల్లా(Vikrabad) నవాబుపేట మండలంలోని ఎక్‌మామిడి గ్రామ పంచాయతీ సెక్రటరీ శోభారాణి నోటీసులు అందజేశారు. అక్రమ నిర్మాణలపై వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. వికారాబాద్ ఎక్‌మామిడి గ్రామంలో అలీకి వ్యవసాయ భూమి ఉంది. కుటుంబంతో ఎప్పటికప్పుడు అక్కడికి వెళ్లి వస్తుంటారు అలీ. అయితే అనుమతి లేకుండా ఆ స్థలంలో ఫామ్ హౌస్ నిర్మించారని, అలానే పన్ను చెల్లించకుండా అందులో నిర్మాణాలు చేపట్టినట్లు గ్రామ కార్యదర్శి శోభారాణి గుర్తించారు. ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. ఇందుకు సంబంధించి ఈ నెల 5వ తేదీన నోటీసు ఇచ్చారు. అలీ నుంచి స్పందన రాకపోవడంతో ఇప్పుడు మరోసారి నోటీసులు జారీ చేశారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story