ఈ మధ్య సినిమా వాళ్లంతా ఫ్లాట్లు కొనేస్తున్నారు. కొందరు ఇండిపెండెంట్‌ హౌసెస్‌ను కూడా కొంటున్నారు. ఇప్పుడు ఈ చిట్టాలో స్టార్‌ హీరో అమీర్ ఖాన్ కూడా చేరారు.

ఈ మధ్య సినిమా వాళ్లంతా ఫ్లాట్లు కొనేస్తున్నారు. కొందరు ఇండిపెండెంట్‌ హౌసెస్‌ను కూడా కొంటున్నారు. ఇప్పుడు ఈ చిట్టాలో స్టార్‌ హీరో అమిర్‌ఖాన్‌(Amirkhan) కూడా చేరారు. ఇప్పటికే అర డజనుకు పైగా ఇళ్లను కొన్న అమిర్‌ఖాన్‌ ఇప్పుడు మరో ఖరీదైన అపార్ట్‌మెంట్‌(Apartment)ను సొంతం చేసుకున్నాడు. ముంబాయి(Mumbai)లో అతి ఖరీదైన ప్రాంతం పలిహలి(Palihali) ఏరియాలో ఓ సూపర్‌ లగ్జరీ రెడీ టు మూవ్‌ అపార్ట్‌మెంట్‌(Ready to Move Apartments)ను అమిర్‌ఖాన్‌ కొన్నాడు. దీని విలువ సుమారు పది కోట్ల రూపాయలు. జూన్‌ 25వ తేదీన ఈ అపార్ట్‌మెంట్‌ కొనుగోలు పూర్తయ్యిందట. ఇందుకోసం 58.5 లక్షల రూపాయల స్టాంప్‌ డ్యూటీని, 30 వేల రూపాయల రిజిస్ట్రేషన్‌ ఫీజును చెల్లించాడట! అమిర్‌ఖాన్‌కు ముంబాయిలోని మెరీనా, బాంద్రాలో సముద్రం ఒడ్డున ఫ్లాట్స్‌ ఉన్నాయి. అలానే పంచగనిలో ఫామ్‌ హౌస్‌ ఉంది. ఇక ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh), ఢిల్లీ(Delhi)లోనూ ఆస్తులు ఉన్నాయి. లాల్ సింగ్ చద్దా(Laal Singh Chaddha) తర్వాత మరే సినిమాలోనూ నటించని అమిర్‌ఖాన్‌ నిర్మాతగా మాత్రం సినిమాలు చేస్తున్నాడు. లేటెస్ట్‌గా తన మాజీ భారయ కిరణ్‌రావ్‌ దర్శకత్వంలో నిర్మించిన లా పతా లేడిస్‌(Laapataa Ladies) సినిమా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story